వ్యాక్సినేషన్‌ బాధ్యత సర్పంచులు తీసుకోవాలి

ABN , First Publish Date - 2021-04-23T10:56:47+05:30 IST

Serpents should be responsible for single vaccination

వ్యాక్సినేషన్‌ బాధ్యత సర్పంచులు తీసుకోవాలి

అమరావతి, ఏప్రిల్‌ 22 (ఆంధ్రజ్యోతి):సర్పంచ్‌, వార్డు సభ్యులు కొవిడ్‌ నివారణ చర్యలు చేపట్టాలని, వారు పూనుకుంటే గ్రామమంతా బాగుపడుతుందని పంచాయతీరాజ్‌, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్‌ గిరిజాశంకర్‌ అన్నారు. కొవిడ్‌-19 వ్యూహాత్మక సమాచార చేరవేత, వ్యాక్సినేషన్‌, ప్రజ ల్లో సానుకూల దృక్పథం, ప్రవర్తనలో మార్పు, కొవిడ్‌ నియంత్రణ, ప్రజలు-ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం అన్న అంశంపై గురువారం సర్పంచులు, వార్డు సభ్యులకు వెబ్‌ఎక్స్‌ ద్వారా శిక్షణ  కార్యక్రమాన్ని ఆయన ప్రారంభించారు.


భౌతికదూరం, మాస్క్‌, శానిటైజర్‌ వాడకంపై గ్రామాల్లో అవగాహన కల్పించాలని, అవసరమైతే చాటింపు వేసి, ముఖ్యమైన కూడళ్లలో బ్యానర్లు పెట్టాలని సూచించారు. కరోనా సమయంలో జనం గుమిగూడకుండా చూడాలని, అవసరమైతే తప్ప గ్రామం విడిచి బయటకు వెళ్లరాదని పేర్కొన్నారు. జాగ్రత్తలు పాటించకపోవడమే అన్ని సమస్యలకూ కారణమవుతోందన్నారు.

Updated Date - 2021-04-23T10:56:47+05:30 IST