అనాథకు సేవలు చేసి..!

ABN , First Publish Date - 2021-06-16T05:04:23+05:30 IST

రోడ్డుపై అచేతనంగా పడి ఉన్న ఓ వ్యక్తిని చూసి వారంతా చలించిపోయారు.. వెంటనే ఆతడికి సపర్యలు చేసి వైద్య సేవలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు పలాస ప్రభుత్వాసుపత్రి సిబ్బంది..

అనాథకు సేవలు చేసి..!
ఆసుపత్రి ఆవరణలో అనాఽథకు స్నానం చేయిస్తున్న సిబ్బంది


  మానవత్వం చాటుకున్న పలాస ప్రభుత్వాసుపత్రి సిబ్బంది

  వైద్యసేవలందిస్తున్న వైనం

పలాస, జూన్‌ 15: రోడ్డుపై అచేతనంగా పడి ఉన్న ఓ వ్యక్తిని చూసి వారంతా చలించిపోయారు.. వెంటనే ఆతడికి సపర్యలు చేసి వైద్య సేవలు అందించి మానవత్వాన్ని చాటుకున్నారు పలాస ప్రభుత్వాసుపత్రి సిబ్బంది.. వివరాలిలా ఉన్నాయి.. పలాస ఈ-సేవ కేంద్రం సమీపంలో రెండురోజుల నుంచి వజ్రపుకొత్తూరు మండలా నికి చెందిన ఓ వ్యక్తి రోడ్డుపై నిద్రాహారాలు లేక అచేతనంగా పడి ఉన్నాడు. మంగళవారం విధులకు వెళుతున్న ప్రభుత్వాసుపత్రి హెడ్‌ నర్స్‌ నీలవేణి, సిబ్బంది అరుణ, శ్రీదేవి, రాధిక రోడ్డుపై పడి ఉన్న వ్యక్తిని చూశారు. ఆయన నుంచి వివరాలు సేకరించాలని ప్రయత్నించినా తిండిలేక నీరసించి ఉండడంతో సమాధానం చెప్పలేక పోయా డు. వెంటనే అతడిని స్థానికులు, ఆసుపత్రి కౌన్సిలర్‌ శ్రీకాంత్‌, సూప ర్‌వైజర్‌ శ్రీను సహకారంతో ఆసుపత్రికి తీసుకువచ్చారు. చేర్పిం చారు. ఆయన శరీరం, దుస్తుల నుంచి దుర్వాసన వస్తుండడంతో వెం టనే స్నానం చేయించి సపర్యలు చేశారు. ఆసుపత్రిలో చేర్పించి సిలైన్‌ ఎక్కించారు. అనంతరం ఆహారం అందించి ఆయన నుంచి వివరాలు తీసుకున్నారు. తనకు ఎవరూ లేరని అతడు చెప్పడంతో ప్రస్తుతానికి మందులు, ఆహారం అందిస్తున్నారు. ఆసుపత్రి సిబ్బంది మానవత్వంతో తీసుకున్న చొరవపై స్థానికులు ప్రశంసలు కురిపిస్తున్నారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉంది. వైద్యాధికారులు పరీక్షించి తిండిలేక నీరసించిపోయినట్లు గుర్తించారు. పూర్తిగా కోలుకున్న తర్వాత పంపిస్తామని సిబ్బంది తెలిపారు.

 

 

Updated Date - 2021-06-16T05:04:23+05:30 IST