వైద్య కళాశాలతో మెరుగైన సేవలు

ABN , First Publish Date - 2022-07-02T05:38:19+05:30 IST

వైద్య కళాశాలతో మెరుగైన సేవలు

వైద్య కళాశాలతో మెరుగైన సేవలు
మాట్లాడుతున్న డైరెక్టర్‌ రాఘవేంద్రరావు

- వైద్య విద్య డైరెక్టర్‌ రాఘవేంద్రరావు 

విజయనగరం రింగురోడ్డు: జిల్లాలో త్వరలో ప్రారంభం కానున్న వైద్య కళాశాలతో ప్రజలకు మరింత మెరుగైన వైద్య సేవలు అందుతాయని వైద్య విద్య డైరెక్టరు రాఘవేంద్రరావు అన్నారు. ఈ మేరకు శుక్రవారం జిల్లా కేంద్రాసుపత్రిని ఆయన పరిశీలించారు. ఓపీ, క్యాజువాలిటీ, ఐసీయూ తదితర విభాగాలతో పాటు బోధనాసుపత్రి కోసం ఏర్పాటు చేస్తున్న విభాగాలను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... వచ్చే ఏడాదిలో రాష్ట్రంలో ఐదు మెడికల్‌ కళాశాలలు ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రిలో బోధనాసుపత్రికి సంబంధించి ఆధునీకరణ పనులు పరిశీలించేందుకు వచ్చినట్టు తెలిపారు. సెప్టెంబరు, అక్టోబరులో నేషనల్‌ మెడికల్‌ కౌన్సిల్‌ ప్రతినిధులు ఇక్కడకు తనిఖీకి రానున్నట్టు తెలిపారు. వైద్య కళాశాల స్థాపనకు ఇప్పటికే జీవో కూడా జారీ చేసినట్టు తెలిపారు. వైద్య కళాశాల నిర్మాణానికి సంబంధించిన పనులు శరవేగంగా జరుగుతున్నాయన్నారు. డీసీహెచ్‌ఎస్‌ వి.లక్ష్మణరావు, సూపరింటెండెంట్‌ సీతారామరాజు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Updated Date - 2022-07-02T05:38:19+05:30 IST