రమణీయం.. సీతారాముల రథోత్సవం

ABN , First Publish Date - 2021-04-23T05:20:08+05:30 IST

మండలంలోని నేమకల్లు గ్రామంలో సీతారాముల రథోత్సవం అశేష జనవాహిని మధ్య గురువారం వైభవంగా నిర్వహించారు.

రమణీయం.. సీతారాముల రథోత్సవం

చిప్పగిరి, ఏప్రిల్‌ 22: మండలంలోని నేమకల్లు గ్రామంలో సీతారాముల రథోత్సవం అశేష జనవాహిని మధ్య గురువారం వైభవంగా నిర్వహించారు. ఉదయం వేదపండితుడు బెల్డోణ రామనాథశాస్తి ఆధ్వర్యంలో ఆలయంలో ప్రత్యేక పూజలు చేసి సీతారాములుకు కల్యాణోత్సవం నిర్వహించారు. సీతారాముల కల్యాణోత్సవానికి ఇతర గ్రామాల నుంచి భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. సాయంత్రం సీతారాముల ఆలయంలో ఉన్న మూలవిరాఠ్‌ను వివిధ రకాల పూలతో అలంకరించిన రథంలో ఉంచి ఆలయం నుంచి ఆంజనేయస్వామి దేవాలయం వరకు రథాన్ని లాగారు. భక్తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్‌ ప్రేమ్‌కుమార్‌, వేదపండితుడు రాము, గ్రామ పెద్దలు పాలల్గొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎస్‌ఐ సతీష్‌కుమార్‌ పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు. 


కమనీయం.. కల్యాణం  

డోన్‌(రూరల్‌): మండలంలోని గోసానిపల్లె గ్రామంలో సీతారాముల కల్యాణో త్సవం కమణీయంగా సాగింది. కల్యాణోత్సవానికి భక్తులు పెద్దఎత్తున హాజర య్యారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు. ఆలయ పూజారులు భక్తు లకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గ్రామంలో రాతిదూలం పందెం పోటీ లను నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. అలాగే చిన్న మల్కా పురం గ్రామంలోని రాములోరి ఆలయంలో సీతారాముల కల్యాణోత్సవం వై భవం గా నిర్వహించారు.ఉదయం ఆల్పాహారం, మధ్యాహ్నం అన్నదానం ఏర్పాటు చేశారు. కొచ్చెర్వు గ్రామంలో రామస్వామి గుడిలో సీతారాముల కల్యాణం నిర్వహించారు. 


డోన్‌: మండలంలోని కమలాపురం గ్రామంలో గురువారం సీతారాముల కల్యాణోత్సవం గురువారం వైభవంగా నిర్వహించారు. బార్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రేగటి రాజశేఖర్‌ రెడ్డి, మాజీ ఎంపీపీ రామకృష్ణారెడ్డి, సర్పంచ్‌ రేగటి అర్జున్‌ రెడ్డి, రేగటి రామ్మోహన్‌ రెడ్డి, బొబ్బల శివరామిరెడ్డి గ్రామపెద్దల ఆధ్వర్యంలో గ్రామంలోని శ్రీరాముల దేవాలయ ఆవరణలో సీతారాముల కల్యాణోత్సవం కన్నుల పండువగా సాగింది. ఆలయ పూజారులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. అనంతరం గ్రామంలో బండలాగుడు పోటీలు, గుండు ఎత్తు పందెం నిర్వహించారు. భక్తులకు అన్నదానం ఏర్పాటు చేశారు.


సీతా రామాంజనేయులు రథోత్సవం

పెద్దకడబూరు: మండలంలోని మురవణి గ్రామం సీతారామంజినేయ ఆలయంలో గురువారం రథోత్సవం నిర్వహించారు. ఉదయం కుంకుమార్చన, బిల్వార్చన, పుష్పాభిషేకం, పట్టువస్రాలు సమర్పించారు. సాయంత్రం శాంతి హోమం, మహామంగళ హారతి, కలశ పూజలు నిర్వహించి రథాన్ని లాగారు. 


పత్తికొండరూరల్‌: మండలంలోని చిన్నహుల్తి, అటికెలగుండు గ్రామంలో సీతారాముల కల్యాణం, రథోత్సవాలు వైభవంగా నిర్వహించారు. భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.


ఆదోని రూరల్‌: ఆదోని మండలం డనాపురంలో వెలసిన ప్రసన్న ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం గణపతిపూజ, కుంకుమార్చన, సింధూర అర్చన, అభిషేకం  నిర్వహించారు. మధ్యాహ్నం భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం రథోత్సవం చేపట్టారు. ఇస్వీ ఎస్‌ఐ విజయలక్ష్మి పోలీస్‌ బందోబస్తు ఏర్పాటు చేశారు

Updated Date - 2021-04-23T05:20:08+05:30 IST