అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించండి

ABN , First Publish Date - 2022-07-01T06:01:33+05:30 IST

ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా బాఽధితులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ సంబంధిత అధికారులకు సూచించారు.

అట్రాసిటీ కేసులను త్వరగా పరిష్కరించండి
విజిలెన్స్‌, మానిటరింగ్‌ సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ శరత్‌

సంగారెడ్డి టౌన్‌, జూన్‌ 30 : ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో దర్యాప్తును వేగవంతంగా పూర్తి చేసి సాధ్యమైనంత త్వరగా బాఽధితులకు న్యాయం జరిగేలా చూడాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌  సంబంధిత అధికారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్‌ సమావేశం మందిరంలో కలెక్టర్‌ అధ్యక్షతన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో ఎస్పీ రమణకుమార్‌ అట్రాసిటి కేసుల పురోగతిపై   సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ...  2020-22 వరకు జిల్లాలో 130 అట్రాసిటీ కేసులలో 103 కేసుల్లో బాధితులకు రూ.1,50,49,500 ఎక్స్‌గ్రేషియా మంజూరు చేసినట్టు కలెక్టర్‌ తెలిపారు. భూ సమస్యలు, భూ తగాదాలతో ముడిపడి ఉన్న కేసులకు సంబంధించి జాప్యం చేయరాదని రెవెన్యూ అధికారులకు సూచించారు.  డివిజన్‌ స్థాయిలో విజిలెన్స్‌ అండ్‌ మానిటరింగ్‌ కమిటీ ఏర్పాటుకు సభ్యులను నామినేట్‌ చేయడానికి రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, డీఎస్పీలు చర్యలు చేపట్టాలని సూచించారు. జిల్లా ఎస్పీ రమణకుమార్‌ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులకు సంబంధించిన  బాధితులు మధ్యవర్తులను ఆశ్రయించకుండా చూడాలని కోరారు. అనంతరం జిల్లా విజిలెన్స్‌, మానిటరింగ్‌ కమిటీకి నూతనంగా నామినేట్‌ అయిన సభ్యులకు సన్మానం చేశారు. ఈ సమావేశంలో షెడ్యూల్‌ కులాల అభివృద్ధి శాఖ డీడీ అఖిల్‌రెడ్డి, డీఎస్పీలు, రెవెన్యూ డివిజనల్‌ అధికారులు, సంబంధిత శాఖల అధికారులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్‌, విజిలెన్స్‌అండ్‌ మానిటరింగ్‌ కమిటీ సభ్యులు దుర్గాప్రసాద్‌, రామకృష్ణ, చంద్రశేఖర్‌, కె.ఇమ్మయ్య పాల్గొన్నారు. 


గడువులోగా ‘మన ఊరు- మన బడి’ పనులు పూర్తి కావాలి

మన ఊరు- మన బడి కార్యక్రమం కింద అనుమతి పొందిన పాఠశాలల పనులు నిర్ణీత గడువులోగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎ.శరత్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయంలో విద్యాశాఖ, ఇంజనీరింగ్‌ శాఖల అఽధికారులతో ‘మన ఊరు- మనబడి’ పురోగతిపై సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ ఇప్పటి వరకు పూర్తి అయిన పనుల వివరాలను, ప్రస్తుతం నడుస్తున్న పనులు, ఇంకా ప్రారంభం కాని పనులపై ఆయా శాఖల అధికారులకు నిశానిర్ధేశం చేశారు. జూలై 15లోగా పనులు పూర్తి చేయాలని ఆదేశించారు. ఎన్‌ఆర్‌ఈజీఎస్‌ వివరాలను ఆన్‌లైన్‌లో అప్‌లోడ్‌ చేయాలని జిల్లా విద్యాధికారి రాజే్‌షను ఆదేశించారు. సమీక్షలో అదనపు కలెక్టర్‌ రాజర్షిషా, జిల్లా విద్యాధికారి నాంపల్లి రాజేష్‌, పంచాయతీ రాజ్‌ ఇంజనీరింగ్‌ శాఖ ఈఈలు జగదీష్‌, అంజయ్య, టీఎ్‌సఈడబ్య్లూ, ఐడీసీ ఈఈ. శ్రీనివాసరెడ్డి, ఇరిగేషన్‌శాఖ డీఈఈ, పబ్లిక్‌హెల్త్‌ శాఖ డీఈఈ, ఆయా ఇంజనీరింగ్‌ శాఖల డీఈఈలు  పాల్గొన్నారు.  

Updated Date - 2022-07-01T06:01:33+05:30 IST