బంజారాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి

ABN , First Publish Date - 2021-03-01T04:12:58+05:30 IST

తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తూ బంజారాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే దివాకర్‌రావు, జడ్పీచైర్‌ పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌లు పేర్కొన్నారు.

బంజారాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి
సమావేశంలో మాట్లాడుతున్న ఎమ్మెల్యే దివాకర్‌రావు

మంచిర్యాల కలెక్టరేట్‌, ఫిబ్రవరి 28 : తండాలను గ్రామ పంచాయతీలుగా చేస్తూ బంజారాల అభ్యున్నతికి ముఖ్యమంత్రి కేసీఆర్‌ కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే దివాకర్‌రావు, జడ్పీచైర్‌ పర్సన్‌ నల్లాల భాగ్యలక్ష్మి, ఎమ్మెల్సీ పురాణం సతీష్‌కుమార్‌లు పేర్కొన్నారు. సంత్‌సేవాలాల్‌ మహరాజ్‌ 282వ జయంతి పురస్కరించుకుని ఐబి చౌరస్తా నుంచి బాలుర ఉన్నత పాఠశాల వరకు ర్యాలీ నిర్వహించారు. సమావేశంలో వారు మాట్లాడుతూ సంత్‌ సేవాలాల్‌ సమాజాన్ని తన బోధనల ద్వారా సన్మార్గంలో నడిపించారన్నారు. సంత్‌సేవాలాల్‌ జయంతిని ప్రభుత్వం అధికారికంగా నిర్వహిస్తోందన్నారు. సేవాలాల్‌ మహరాజ్‌ బంజారాలను చైతన్యపరిచి వారి హక్కులను గుర్తు చేసిన సంఘ సంస్కర్త అని అన్నారు. జిల్లా కేంద్రంలో సంత్‌సేవాలాల్‌ సేనా నాయకుల విజ్ఞప్తి మేరకు స్థలం కేటాయింపునకు కృషి చేస్తానన్నారు.  సంత్‌సేవాలాల్‌ మహరాజ్‌ మందిర నిర్మాణం కోసం కూడా కృషి చేస్తానని అన్నారు.  దళిత, గిరిజన అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలను సీఎం ప్రవేశపెట్టారన్నారు. సంత్‌సేవాలాల్‌ సేనా జిల్లా అధ్యక్షుడు రఘునాథ్‌ చౌహాన్‌ మాట్లాడుతూ సంత్‌సేవాలాల్‌ మహరాజ్‌ బంజారాలను ఏకతాటిపైకి తీసుకొచ్చారన్నారు. కార్యక్రమంలో జిల్లా గౌరవ అధ్యక్షుడు తేజావత్‌ రాంబాబు నాయక్‌, మున్సిపల్‌ చైర్మన్‌ పెంట రాజయ్య, వైస్‌ చైర్మన్‌ ముఖేష్‌గౌడ్‌, డీటీడీఓ నారాయణ రెడ్డి, పత్తి వెంకటేష్‌, ఇందల్‌నాయక్‌, అజ్మీర రాజు నాయక్‌, లాల్‌కుమార్‌,  భాగ్య, లకావత్‌ రాజు నాయక్‌, జాదవ్‌ ప్రకాష్‌, బూక్యా రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Updated Date - 2021-03-01T04:12:58+05:30 IST