Peru దేశంలో కూలిన టూరిస్ట్ విమానం...ఏడుగురి మృతి

ABN , First Publish Date - 2022-02-05T12:29:31+05:30 IST

పెరూ దేశంలో టూరిస్టు విమానం కుప్పకూలిన దుర్ఘటనలో ఏడుగురు మరణించారు....

Peru దేశంలో కూలిన టూరిస్ట్ విమానం...ఏడుగురి మృతి

లిమా(పెరూ): పెరూ దేశంలో టూరిస్టు విమానం కుప్పకూలిన దుర్ఘటనలో ఏడుగురు మరణించారు. ఏరోసాంటోస్ టూరిజం కంపెనీకి చెందిన సెస్నా 207 సింగిల్ ఇంజిన్ విమానం నజ్కాలోని మరియా రీచీ విమానాశ్రయం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే కుప్పకూలి పోయింది.పెరూలోని ప్రసిద్ధ నజ్కా మార్గాలను వీక్షించేందుకు వెళ్లిన వారి విమానం కూలిపోవడంతో ఐదుగురు పర్యాటకులు, ఇద్దరు పైలెట్లు  మరణించారని పెరూ రవాణా మంత్రిత్వ శాఖ తెలిపింది.సెస్నా 207 సింగిల్ ఇంజన్ విమానంలో ఉన్న ఏడుగురిలో ఎవరూ ప్రాణాలతో లేరని అధికార వర్గాలు తెలిపాయి.విమానంలో ఉన్న ఏడుగురిలో ఇద్దరు చిలీ పర్యాటకులు ఉన్నారని దౌత్యఅధికారి తెలిపారు.


మరియా రీచీ ఎయిర్‌ఫీల్డ్ నుంచి డజన్ల కొద్దీ విమానాలు నడుస్తున్నాయి. విదేశీ పర్యాటకులు యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం అయిన నాజ్కా లైన్‌ల మీదుగా విమానాల్లో ప్రయాణిస్తూ వీక్షిస్తుంటారు. 2010 వ సంవత్సరం అక్టోబరులో ఎయిర్‌నాస్కా ఎయిర్‌క్రాఫ్ట్ క్రాష్ అయినప్పుడు నలుగురు బ్రిటీష్ పర్యాటకులు,ఇద్దరు పెరూవియన్ సిబ్బంది మరణించారు.


Updated Date - 2022-02-05T12:29:31+05:30 IST