ఫిలాడెల్ఫియాలో కాల్పుల కలకలం !

ABN , First Publish Date - 2021-03-27T17:20:44+05:30 IST

అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి.

ఫిలాడెల్ఫియాలో కాల్పుల కలకలం !

ఫిలాడెల్ఫియా: అగ్రరాజ్యం అమెరికాలో మరోసారి కాల్పులు కలకలం సృష్టించాయి. శుక్రవారం రాత్రి(అమెరికా కాలమానం ప్రకారం) ఫిలాడెల్ఫియాలోని ఓ స్పోర్ట్స్ బార్‌లో కాల్పులు చోటుచేసుకున్నాయి. ఈ ఘటనలో ఏడుగురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల్లోకి వెళ్తే.. ఫిలాడెల్ఫియాలోని స్థానిక గోల్ఫ్ & సోషల్ స్పోర్ట్స్ బార్‌ బయట కాల్పులు జరిగాయి. దీంతో అక్కడ ఉన్నావారందరూ ఒక్కసారిగా పరుగులు పెట్టారు. ఇది గమనించిన ఓ వ్యక్తి ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించాడు. అతని సమాచారంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు గాయపడిన ఏడుగురిని చికిత్స కోసం సమీపంలోని ఆస్పత్రికి తరలించారు. బాధితుల్లో ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు వెల్లడించారు. అయితే, ఈ కాల్పులకు పాల్పడింది ఎవరో తెలియాల్సి ఉందని, బాధితుల సమాచారం మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు ఫిలాడెల్ఫియా పోలీసులు తెలిపారు.      



Updated Date - 2021-03-27T17:20:44+05:30 IST