
మండీ : హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలోని మండీ జిల్లా పాఠశాలలో 79 మంది విద్యార్థులకు కొవిడ్ పాజిటివ్ అని తేలింది. మండీ జిల్లా ధరంపూర్ పట్టణంలోని పాఠశాలలో ముగ్గురు ఉపాధ్యాయులు, 79 మంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ అని పరీక్షల్లో వెల్లడైంది. విద్యార్థులకు కరోనా సోకడంతో ఈనెల 25వతేదీ వరకు పాఠశాలలను మూసివేయాలని హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.కరోనా వ్యాప్తి భయంతో రెసిడెన్షియల్ స్కూళ్లు మినహా అన్ని పాఠశాలలను మూసివేశారు.పాఠశాలలను మూసివేసినా, ఉపాధ్యాయులు, పాఠశాల నాన్ టీచింగ్ ఉద్యోగులు మాత్రం విధులకు హాజరు కావాలని హిమాచల్ ప్రదేశ్ సర్కారు కోరింది.