కెనడాలో కాల్పుల కలకలం.. వీధుల్లో బతుకీడుస్తున్న పలువురు నిరాశ్రయుల మృతి.. !

ABN , First Publish Date - 2022-07-26T05:02:04+05:30 IST

కెనడాలోని బ్రిటీష్ కొలంబియా(British Columbia) రాష్ట్రంలో సోమవారం కాల్పుల(Shooting) కలకలం రేగింది.

కెనడాలో కాల్పుల కలకలం.. వీధుల్లో బతుకీడుస్తున్న పలువురు నిరాశ్రయుల మృతి.. !

ఎన్నారై డెస్క్: కెనడాలోని బ్రిటీష్ కొలంబియా(British Columbia) రాష్ట్రంలో సోమవారం కాల్పుల(Shooting) కలకలం రేగింది. లాంగ్లీ నగరంలో ఈ ఉదయం చోటుచేసుకున్న కాల్పుల ఘటనలో వీధుల్లో నివసిస్తున్న పలువురు నిరాశ్రయులు(Homeless) కన్నుమూశారు. కాల్పుల నేపథ్యంలో పోలీసులు ప్రజలను అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. ఘటన స్థలం సమీపంలోకి ఎవరూ రావద్దని సూచించారు. ఈ మేరకు స్థానికుల ఫోన్లకు సందేశాలు పంపించారు. కాగా.. ఈ ఘటనలో కొందరు మరణించారని పోలీసు శాఖ అధికార ప్రతినిధి ఒకరు మీడియాకు తెలిపారు. అయితే.. ఎంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నారనే దానిపై స్పష్టత ఇవ్వలేదు. ఇదిలా ఉంటే..స్పష్టమైన లక్ష్యంతోనే నిందితులు ఈ దారుణానికి తెగబడ్డట్టు స్థానిక మీడియాలో కథనాలు వెలువడ్డాయి. పూర్తి వివరాలు మాత్రం ఇంకా వెల్లడికాలేదు. ఈ విషయంపై పోలీసులు ఇంకా ఎటువంటి ప్రకటన విడుదల చేయలేదు. 

Updated Date - 2022-07-26T05:02:04+05:30 IST