crane collapse: కెనడాలో పలువురి దుర్మరణం
ABN , First Publish Date - 2021-07-13T13:59:29+05:30 IST
కెనడా దేశంలోని కేలోవ్నా బీసీ ప్రాంతంలో క్రేన్ కూలిపోవడంతో పలువురు కార్మికులు మరణించారు....
కేలోవ్నా(కెనడా): కెనడా దేశంలోని కేలోవ్నా బీసీ ప్రాంతంలో క్రేన్ కూలిపోవడంతో పలువురు కార్మికులు మరణించారు.కేలోవ్నా బీసీ ప్రాంతంలో 25 అంతస్తుల రెసిడెన్షియల్ టవరు నిర్మిస్తుండగా ఈ క్రేన్ ప్రమాదం జరిగింది.ఈ క్రేన్ ప్రమాదానికి కారణం తెలియదని మిషన్ గ్రూపునకు చెందిన జోనాథన్ ప్రైసెస్ చెప్పారు. భవన నిర్మాణ పనిలో ఉన్న కార్మికులు క్రేన్ కూలడం వల్ల ప్రాణాలు కోల్పోయారని జోనాథన్ తెలిపారు. కార్మికుల భద్రత కోసం తాము చర్యలు తీసుకుంటున్నా, ప్రమాదం జరగడం దురదృష్ణకరమని ఆయన చెప్పారు.ఈ ప్రమాదంలో ఎంతమంది మరణించారనేది ఇంకా తేలలేదు. ఈ ఘటనలో గాయపడిన ముగ్గురిని బీసీ హెల్త్ సర్వీసెస్ ఆసుపత్రికి తరలించిందని, ఇందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెప్పారు.భవన నిర్మాణ స్థలంలో పెద్ద శబ్ధంతో క్రేన్ కుప్పకూలి పోయిందని ప్రత్యక్షసాక్షులు చెప్పారు.