ఫైజర్ టీకా: యూఎస్ హెల్త్ వర్కర్‌కు సీరియస్ అలెర్జీ సమస్య!

ABN , First Publish Date - 2020-12-17T15:51:09+05:30 IST

అగ్రరాజ్యం అమెరికా సోమవారం నుంచి ఫైజర్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే.

ఫైజర్ టీకా: యూఎస్ హెల్త్ వర్కర్‌కు సీరియస్ అలెర్జీ సమస్య!

వాషింగ్టన్: అగ్రరాజ్యం అమెరికా సోమవారం నుంచి ఫైజర్ వ్యాక్సినేషన్ ప్రారంభించిన విషయం తెలిసిందే. దీనిలో భాగంగా మంగళవారం అలస్కాలో ఓ హెల్త్ వర్కర్‌కు ఫైజర్ టీకా ఇచ్చారు. అయితే, వ్యాక్సిన్ తీసుకున్న నిమిషాల వ్యవధిలోనే హెల్త్ వర్కర్‌కు తీవ్రమైన అలెర్జీ సమస్య తలెత్తింది. ఇంతకుముందు ఈ పేషెంట్‌కు ఎలాంటి అలెర్జీ సమస్యలు లేవని చికిత్స అందిస్తున్న ఎవర్జెన్సీ డిపార్ట్‌మెంట్ డైరెక్టర్ లిండే జోన్స్ వెల్లడించారు. అలెర్జీ చికిత్స ఎపినెఫ్రిన్ అనంతరం పేషెంట్ ఆరోగ్య పరిస్థితి మెరుగు పడిందన్నారు. ప్రస్తుతం పేషెంట్‌ రాజధాని జునాయులోని బార్ట్‌లెట్ ప్రాంతీయ ఆసుపత్రిలో వైద్యుల పర్యవేక్షణలో ఉన్నట్లు తెలిపారు. 


ఈ ఘటన నేపథ్యంలో యూఎస్ ఫుడ్ అండ్ డ్రగ్ అడ్మినిస్ట్రేషన్ కీలక ప్రకటన చేసింది. అలెర్జీ ఉన్న చాలా మంది అమెరికన్లు టీకా తీసుకున్న కూడా వారిలో ఎలాంటి సమస్య తలెత్తలేదని, సురక్షితంగా ఉన్నట్లు వెల్లడించింది. కాగా, బ్రిటన్‌లో కూడా ఇలాగే వ్యాక్సిన్ తీసుకున్న ఇద్దరు అలెర్జీతో బాధపడ్డ సంగతి తెలిసిందే. చికిత్స అంనంతరం వారు కోలుకున్నారు. అందుకే అలెర్జీ సమస్యలు ఉన్నవారు ఫైజర్-బయోఎన్‌టెక్ కొవిడ్ వ్యాక్సిన్‌కు దూరంగా ఉండాలని బ్రిటన్ మెడికల్ రెగ్యులేటర్ అథారిటీ దేశ ప్రజలను వారించింది. 

Updated Date - 2020-12-17T15:51:09+05:30 IST