రోడ్డుపైనే మురుగు నీరు

ABN , First Publish Date - 2021-10-18T05:05:21+05:30 IST

మండల కేంద్రంలోని రూపనగుడి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది.

రోడ్డుపైనే మురుగు నీరు
రోడ్డు వెంట ప్రవహిస్తున్న మురుగు నీరు

ఉయ్యాలవాడ, అక్టోబరు 17: మండల కేంద్రంలోని రూపనగుడి గ్రామానికి వెళ్లే రహదారి అధ్వానంగా ఉంది. ఉయ్యాలవాడ గ్రామం నుంచి వచ్చే మురుగు నీరంతా రోడ్డుపై ప్రవహిస్తూ వాహనదారులు, ప్రయాణికులకు, పాదచారులకు ఇబ్బందికరంగా మారింది. నెల రోజులుగా మురుగు కాలువల్లోని వ్యర్థాలు తొగించపోవడంతో మురుగు నీరంతా కాలువల్లో నుంచి బయటకు వచ్చి రోడ్డుపై ప్రవహిస్తోంది. సీసీ రోడ్డు కావటంతో పాచి పేరుకపోయి ద్విచక్ర వాహనదారులు, పాదచారులు కాలు జారి కింద పడిపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి రోడ్డుపై మురుగు నీరు ప్రవహించకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. 

త్వరలో సమస్య పరిష్కరిస్తాం

గ్రామం నుంచి రూపనగుడి గ్రామానికి వెళ్లే రహదారిలో మురుగు నీరు ప్రవహిస్తున్న మాట వాస్తవమే. అయితే గతంలో మురుగు నీరంతా గ్రామానికి చెందిన ఓ రైతు పొలం గుండా వెళ్లేది. ప్రస్తుతం ఆ రైతు తన పొలాన్ని ఎత్తు పెంచటం వల్ల మురుగు నీరు వెళ్లేందుకు మార్గం లేదు, రోడ్డు ఎత్తు తక్కువగా ఉ న్నందున కాలువల్లోని మురుగు నీరంతా రోడ్డుపై ప్రవహిస్తుంది. గ్రామ పెద్దల సహకారంతో సమస్యను త్వరలో పరిష్కరించి మురుగు కాలువను ఏర్పాటు చేస్తాం. 

- నూర్‌బాషా, పంచాయతీ కార్యదర్శి

Updated Date - 2021-10-18T05:05:21+05:30 IST