offices: మహిళా ఉద్యోగినులపై తగ్గిన లైంగిక వేధింపులు

ABN , First Publish Date - 2021-09-06T18:04:04+05:30 IST

కరోనా వైరస్ మహమ్మారితో మహిళా ఉద్యోగినులు వర్క్ ఫ్రం హోం వల్ల గత ఆర్థిక సంవత్సరంలో కార్యాలయాల్లో మహిళలపై లైంగికవేధింపుల కేసులు తగ్గాయి....

offices: మహిళా ఉద్యోగినులపై తగ్గిన లైంగిక వేధింపులు

కరోనా వర్క్ ఫ్రం హోం ప్రభావం

ముంబై : కరోనా వైరస్ మహమ్మారితో మహిళా ఉద్యోగినులు వర్క్ ఫ్రం హోం వల్ల గత ఆర్థిక సంవత్సరంలో కార్యాలయాల్లో మహిళలపై లైంగికవేధింపుల కేసులు తగ్గాయి.2020-21 ఆర్థిక సంవత్సరంలో 44 నిఫ్టీ కంపెనీల్లోని పని ప్రదేశాల్లో మహిళా ఉద్యోగినులపై లైంగిక వేధింపుల ఫిర్యాదుల సంఖ్య 38.26 శాతానికి పడిపోయింది. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల లాక్ డౌన్ లు, రిమోట్, వర్క్ ఫ్రం హోం, హైబ్రిడ్ వర్క్ మోడళ్లకు మారడంతో పలు కంపెనీల్లో పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల కేసులు బాగా తగ్గాయని లైంగిక వేధింపుల సలహా డాట్ కాం డేటాలో వెల్లడైంది.


ఈ ఏడాది మార్చి 31తో ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 455 లైంగిక వేధింపుల ఫిర్యాదులు వచ్చాయి. 2019లో 739 లైంగిక వేధింపుల ఫిర్యాదులు నమోదయ్యాయి. 2020 లోనూ 737 ఫిర్యాదులు వచ్చాయి.అదానీ పోర్ట్స్, స్పెషల్ ఎకనామిక్ జోన్, బజాజ్ ఫిన్‌సర్వ్, కోల్ ఇండియా, రిలయన్స్ ఇండస్ట్రీస్, యుపిఎల్, శ్రీ సిమెంట్ కంపెనీల్లో గత ఆరేళ్లుగా మహిళా ఉద్యోగినులపై లైంగికవేధింపుల కేసులు నివేదించలేదు.


గత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వ యాజమాన్యాల కంటే ప్రైవేట్ సంస్థలు పని ప్రదేశాల్లో మహిళలపై లైంగిక వేధింపుల సంఘటనలను ఎక్కువగా నివేదించాయని డేటా చూపించింది. హెచ్డీఎఫ్ సీ బ్యాంకులో 2020-21లో 47 లైంగిక ఫిర్యాదులు వచ్చాయి. స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియాలో 45 కేసులు నమోదయ్యాయి. గతంతో పోలిస్తే విప్రోలో ఫిర్యాదులు గణనీయంగా తగ్గాయి.యాక్సిస్ బ్యాంక్ లో 39 ఫిర్యాదులు, హెచ్‌డిఎఫ్‌సి లైఫ్ ఇన్సూరెన్స్ లో 39, ఐసిఐసిఐ బ్యాంక్ లో 33 , టెక్ మహీంద్రాలో 30 కేసులు నమోదయ్యాయి.


Updated Date - 2021-09-06T18:04:04+05:30 IST