యూపీలో లైంగిక సంబంధం.. టీచర్‌ని చంపేసిన విద్యార్థి

ABN , First Publish Date - 2022-07-05T07:51:06+05:30 IST

చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు.. చదువుకోవాల్సిన విద్యార్థి అదుపుతప్పారు.

యూపీలో లైంగిక సంబంధం.. టీచర్‌ని చంపేసిన విద్యార్థి

అయోధ్య, జూలై 4: చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయురాలు.. చదువుకోవాల్సిన విద్యార్థి అదుపుతప్పారు. అదే ఆ టీచర్‌ చావుకు కారణం కాగా విద్యార్థి జీవితాన్ని నాశనం చేసింది. ఉత్తరప్రదేశ్‌లోని ఆయోధ్యలో ఒక టీచర్‌(30) అదే స్కూల్‌లోని 17ఏళ్ల విద్యార్థి ఒకేప్రాంతంలో నివాసం ఉంటున్నారు.  సాన్నిహిత్యం పెరిగి లైంగిక సంబంధానికి దారితీసింది. ఆమె ప్రస్తుతం గర్భవతి. ఈ క్రమంలో తమ సంబంధాన్ని ఆపేద్దామని విద్యార్థి చెప్పాడు. దానికి ఆమె ఒప్పుకోలేదు. ఈ నేపథ్యంలో ఈ నెల 1న ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్న సమయంలో విద్యార్థి వెళ్లి ఇనుపరాడ్డుతో తలపై కొట్టడంతో చనిపోయిందని ఎస్పీ శైలేష్‌ పాండే పేర్కొన్నారు. తర్వాత రూ.50 వేలు దొంగిలించి హత్యను దోపిడీ దొంగలు చేసినట్లు చిత్రీకరించడానికి ప్రయత్నించాడన్నారు. అరెస్టు చేసి కోర్టుఆదేశాలతో జువెనైల్‌హోంకు తరలించామన్నారు.

Updated Date - 2022-07-05T07:51:06+05:30 IST