మోడల్‌ స్కూళ్లలో ఎస్జీటీ పోస్టుల రద్దు తగదు

Published: Sun, 27 Mar 2022 01:26:34 ISTfb-iconwhatsapp-icontwitter-icon

 సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొక్కిలిగడ్డ సత్యం 

నూజివీడు టౌన్‌, మార్చి 26: సర్వీస్‌ నిబంధనల పేరుతో మోడల్‌ స్కూళ్లలో ఎస్జీటీ పోస్టులను రద్దు చేయడం తగదని సెకండరీ గ్రేడ్‌ టీచర్స్‌ ఫెడరేషన్‌ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొక్కిలిగడ్డ సత్యం అన్నారు. శనివారం ఎస్జీటీఎఫ్‌ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. పన్నెండేళ్ల క్రితం మంజూరైన మోడల్‌ స్కూళ్ల పోస్టుల కోసం 4,784 ఎస్‌జీటీ పోస్టులను రద్దు చేయడంపై ఉపాధ్యాయులు, నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం వచ్చాక డీఎస్సీ ఇవ్వకపోగా ఉన్న పోస్టులను రద్దు చేయడం ఏంటని, ఒక్క స్కూల్‌ను కూడా మూసివేయబోమని, పోస్టులన్నీ భర్తీ చేస్తామని ప్రభుత్వం చెప్పిన మాటలకు, చేతలకు పొంతన లేదన్నారు. 

Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.