YSR గొప్ప మానవవాతావాది: Shabbir Ali

ABN , First Publish Date - 2022-07-08T18:10:56+05:30 IST

వైఎస్ రాజశేఖర్ రెడ్డిని టీ.కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ గొప్ప మానవతావాదితో పోల్చారు.

YSR గొప్ప మానవవాతావాది: Shabbir Ali

హైదరాబాద్ (Hyderabad): వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YS Rajasekhar Reddy)ని టీ.కాంగ్రెస్ సీనియర్ నేత షబ్బీర్ అలీ (Shabbir Ali) గొప్ప మానవతావాదితో పోల్చారు. శుక్రవారం వైఎస్ జయంతి సందర్భంగా పంజాగుట్టలోని వైఎస్ విగ్రహానికి పూలమాలవేసి నివాళి అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్లు వైఎస్ఆర్ పుణ్యమే అన్నారు. వైఎస్ వలనే హైదరాబాద్‌కు మెట్రో రైల్, పీవీ ఎక్స్ ప్రెస్ వే, కృష్ణా జలాలను తీసుకొచ్చిన ఘ‌నత వైఎస్‌దే అన్నారు. రాజశేఖర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకుని సీఎం కేసీఆర్ పని చేయాలని షబ్బీర్ అలీ సూచించారు. 

Updated Date - 2022-07-08T18:10:56+05:30 IST