శభాష్‌ నోయెల్‌!

ABN , First Publish Date - 2021-11-25T05:30:00+05:30 IST

ఏడేళ్ల బుడతడు అధికారిక లోగోలను చూసి అది ఏ మల్టీ నేషనల్‌ కంపెనీ అనే విషయాన్ని చిటికెలో చెప్పేస్తాడు....

శభాష్‌ నోయెల్‌!

ఏడేళ్ల బుడతడు అధికారిక లోగోలను చూసి అది ఏ మల్టీ నేషనల్‌ కంపెనీ అనే విషయాన్ని చిటికెలో చెప్పేస్తాడు. ఒకటి...రెండు కాదు, ఏకంగా 120 కంపెనీలను అలా గుర్తిస్తాడు. కొచ్చికి చెందిన నోయెల్‌ అలెగ్జాండర్‌ ప్రతిభ ఇది. 


  1.  నోయెల్‌ 3  నిమిషాల 40 సెకన్లలో లోగోల ఆధారంగా 120 మల్టీ నేషనల్‌ కంపెనీలను గుర్తించి రికార్డుల్లోకి ఎక్కాడు. 
  2.  ప్రస్తుతం ఒకటో తరగతి చదువుతున్న ఈ బుడతడు ఆ కంపెనీల షేర్ల ధరలు, మార్కెట్‌ వాల్యూస్‌ను గమనిస్తుంటాడు. స్టాక్‌ ఎక్చేంజ్‌, మ్యూచువల్‌ ఫండ్స్‌ గురించి అర్థం చేసుకునే పనిలో ఉన్నాడు. ఈ సబ్జెక్ట్‌లంటే చాలా ఆసక్తి కనబరుస్తాడని నోయెల్‌ తల్లిదండ్రులు అంటున్నారు. ‘‘ఆరేళ్ల వయసులో తనలో ప్రత్యేక టాలెంట్‌ ఉన్నట్టు గుర్తించాం. మల్టీ నేషనల్‌ కంపెనీ పేరు చెప్పి వివరాలు చెప్పమనే వాడు. వాడి ఆసక్తిని గమనించి రకరకాల కంపెనీలు, ప్రముఖ వ్యక్తులు, ఆర్థిక వ్యవస్థ గురించి తెలుసుకోవడానికి సహాయం అందించాం’’ అని నోయెల్‌ తల్లిదండ్రులు షీనా, సిబు అన్నారు.
  3. నోయెల్‌ తన ప్రతిభతో ఇండియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లో స్థానం సంపాదించాడు. ఆసియా బుక్‌ ఆఫ్‌ రికార్డుల్లోనూ ఎక్కాడు. 

Updated Date - 2021-11-25T05:30:00+05:30 IST