జాతీయ రహదారిపై సడక్‌ బంద్‌

ABN , First Publish Date - 2022-07-03T03:44:09+05:30 IST

ఎస్సీ రిజర్వేషన్‌పై బీజేపీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శనివారం మధ్యాహ్నం కావలి మండల సరిహద్దు గ్రామమైన రుద్రకోటకు సమీపంలో జాతీయ రహదారిపై ఎమ్మార్పీఎస్‌, ఎమ్మెస్పీ నేతలు సడక్‌ బంద్‌ నిర్వహించారు.

జాతీయ రహదారిపై సడక్‌ బంద్‌
రాస్తారోకో చేస్తున్న వారిని అడ్డుకుంటున్న పోలీసులు

కావలి, జూలై 2: ఎస్సీ రిజర్వేషన్‌పై బీజేపీ స్పష్టత ఇవ్వాలని డిమాండ్‌ చేస్తూ ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు శనివారం మధ్యాహ్నం కావలి మండల సరిహద్దు గ్రామమైన రుద్రకోటకు సమీపంలో జాతీయ రహదారిపై ఎమ్మార్పీఎస్‌, ఎమ్మెస్పీ నేతలు సడక్‌ బంద్‌ నిర్వహించారు. ఎమ్మెస్పీ నేత పందిటి అంబేద్కర్‌ మాదిగ ఆధ్వర్యంలో నేతలు డప్పులు వాయించుకుంటూ హైవే వద్దకు చేరుకున్నారు. అక్కడ రోడ్డుపై బైఠాయించి రాస్తారోకో చేశారు. అయితే కావలి రూరల్‌ మండలం పోలీసులు తమ పరిధికాదని, గుడ్లూరు మండల పోలీసులు తమ పరిధి కాదని కొంత సేపు తర్జన భర్జన పడ్డారు. దీంతో ట్రాఫిక్‌ స్తంభించటంతో కావలి రూరల్‌ సీఐ ఖాజావళి, ఎస్‌ఐ వీరేంద్రబాబు తమ సిబ్బందితో అక్కడకు చేరుకున్నారు. కందుకూరు డీఎస్పీ శ్రీనివాసులు ఆదేశాల మేరకు గుడ్లూరు పోలీసులు కూడా అక్కడకు చేరుకున్నారు. అందరూ కలసి బంద్‌ చేస్తున్న వారికి నచ్చ చెప్పి వారిని రోడ్డుపై నుంచి తొలగింపచేశారు. దీంతో ట్రాపిక్‌ ఏర్పడిన అంతరాయం తొలగిపోయింది. ఈ కార్యక్రమంలో అక్కిలగుంట ఏసుమాదిగ, చేవూరు కిరణ్‌ మాదిగ, కత్తి శివయ్య మాదిగ, జానకీ, సుశీల, కావలి శ్రీను, కే. రామమోహన్‌, బీ. శ్రీరాములు , బీ మనోహర్‌, పెంచలయ్య, విజయ, సాంబ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - 2022-07-03T03:44:09+05:30 IST