చెలరేగిన షఫాలీ, లారా

ABN , First Publish Date - 2022-05-25T07:28:35+05:30 IST

షఫాలీ వర్మ (33 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 51) మెరుపు హాఫ్‌ సెంచరీకి, లారా వోల్వార్ట్‌ (35 బంతుల్లో ఏడు ఫోర్లు, సిక్స్‌తో 51 నాటౌట్‌) అజేయ అర్ధ శతకం తోడవడంతో మహిళల టీ చాలెంజ్‌ టోర్నీలో..

చెలరేగిన షఫాలీ, లారా

వెలాసిటీ సునాయాస విజయం

పుణె: షఫాలీ వర్మ (33 బంతుల్లో 9 ఫోర్లు, సిక్స్‌తో 51) మెరుపు హాఫ్‌ సెంచరీకి, లారా వోల్వార్ట్‌ (35 బంతుల్లో ఏడు ఫోర్లు, సిక్స్‌తో 51 నాటౌట్‌) అజేయ అర్ధ శతకం తోడవడంతో మహిళల టీ చాలెంజ్‌ టోర్నీలో భాగంగా మంగళవారం జరిగిన మ్యాచ్‌లో వెలాసిటీ జట్టు ఏడు వికెట్లతో సూపర్‌ నోవా్‌సపై నెగ్గింది. టాస్‌ కోల్పోయి మొదట బ్యాటింగ్‌ చేసిన నోవాస్‌ 20 ఓవర్లలో 150/5 స్కోరు చేసింది. కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ హాఫ్‌ సెంచరీ (51 బంతు ల్లో 7 ఫోర్లు, 3 సిక్స్‌లతో 71)తో కదం తొక్కింది. తానియా భాటియా (32 బంతుల్లో 3 ఫోర్లతో 36) సత్తాచాటగా, చివర్లో లుస్‌ (14 బంతుల్లో 3 ఫోర్లతో 20 నాటౌట్‌) ధనాధన్‌ ఇన్నింగ్స్‌ ఆడింది. కెటె క్రాస్‌ (2/24) రెండు వికెట్లు పడగొట్టింది.


18/3తో ఇబ్బందుల్లోపడ్డ నోవా్‌సను కౌర్‌-తానియా నాలుగో వికెట్‌కు 82 పరుగులు జోడించి ఆదుకున్నారు. అనంతరం వెలాసిటీ 18.2 ఓవర్లలో 151/3 స్కోరుతో లక్ష్యాన్ని చేరుకుంది. ఓపెనర్‌ షఫాలీ, వోల్వార్ట్‌తోపాటు యాస్తికా భాటియా (17), కెప్టెన్‌ దీప్తీశర్మ (24 నాటౌట్‌) రాణించారు. డాటిన్‌ (2/21) రెండు వికెట్లు తీసింది. హర్మన్‌ప్రీత్‌ ‘ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌’గా నిలిచింది. గురువారం జరిగే మ్యాచ్‌లో వెలాసిటీ-ట్రయల్‌ బ్లేజర్స్‌ తలపడతాయి. 


సంక్షిప్తస్కోర్లు:

సూపర్‌ నోవాస్‌:

20 ఓవర్లలో 150/5 (హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 71, తానియా భాటియా 36, సునె లుస్‌ 20 నాటౌట్‌, కెటె క్రాస్‌ 2/24) 

వెలాసిటీ:

18.2 ఓవర్లలో151/3 (షఫాలీ 51, వోల్వార్ట్‌  51 నాటౌట్‌, దీప్తీ శర్మ 24 నాటౌట్‌, డాటిన్‌ 2/21).

Updated Date - 2022-05-25T07:28:35+05:30 IST