షారుఖ్ - అట్లీ మూవీకి ముహూర్తం కుదిరిందా..?

Jun 2 2021 @ 13:41PM

బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్, తమిళ డైరెక్టర్ అట్లీ కాంబినేషన్‌లో ఓ సినిమా తెరకెక్కనుందనే వార్త గత ఏడాదిగా వస్తూనే ఉంది. కానీ ఇందుకు సంబంధించిన అధికారక ప్రకటన మాత్రం రావడం లేదు. తాజా సమాచారం ప్రకారం ఆగస్టు నుంచి ఈ ప్రాజెక్ట్ పట్టాలెక్కించడానికి ముహూర్తం కుదిరినట్టు తెలుస్తోంది. పవర్ ఫుల్ యాక్షన్ డ్రామాతో కూడుకున్న స్క్రిప్ట్ పూర్తి స్థాయిలో దర్శకుడు రెడీ చేశాడట. వాస్తవంగా ఈ క్రేజీ ప్రాజెక్ట్ సమ్మర్‌లోనే మొదలవ్వాల్సి ఉండగా కరోనా సెకండ్ వేవ్ కారణంగా పోస్ట్‌పోన్  అయిందట. కాగా వచ్చే ఆగస్టులో షూటింగ్ మొదలు పెట్టి అన్నీ అనుకున్నట్టు పూర్తయితే 2022 సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్ చేస్తున్నారట. ప్రస్తుతం షారుక్ 'పఠాన్' సినిమా చేస్తున్నాడు. ఇక అట్లీ 'రాజారాణి', 'పోలీస్', 'అదిరింది', 'విజిల్' లాంటి సూపర్ హిట్స్ తీసి స్టార్ డైరెక్టర్‌గా క్రేజ్ సంపాదించుకున్నాడు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.