Boycott Pathaan trends: మరో బాలీవుడ్ స్టార్ హీరోకి బాయ్‌కాట్ సెగ.. ఈసారి కారణం ఏంటంటే..

Published: Thu, 18 Aug 2022 11:02:10 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Boycott Pathaan trends: మరో బాలీవుడ్ స్టార్ హీరోకి బాయ్‌కాట్ సెగ.. ఈసారి కారణం ఏంటంటే..

ఈ మధ్య బాలీవుడ్‌లో బాయ్‌కాట్ కల్చర్ నడుస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సెగ ఎఫెక్ట్ తగిలి ఆమీర్ ఖాన్(Aamir khan) ‘లాల్ సింగ్ చడ్డా’, అక్షయ్ కుమార్ (Akshay Kumar) ‘రక్షాబంధన్’ విలవిలలాడుతున్నాయి. గతంలో ఆమీర్ ఇండియా అసహనం పెరిగిపోతుందని, ఇక్కడి నుంచి వెళ్లిపోవడం మంచిదంటూ కామెంట్స్ చేయడం కొందరు నెటిజన్ల కోపానికి కారణమైంది. అలాగే.. కరీనా కపూర్ సైతం నెపోటిజం గురించి మాట్లాడుతూ.. వారి సినిమాలు ఎవరూ చూడమంటున్నారంటూ వెటకారంగా మాట్లాడింది. అది కూడా నెటిజన్ల కోపానికి మరో కారణం. దాంతో ఈ ఇద్దరూ స్టార్స్ కలిసి నటించిన మూవీ అట్టర్ ఫ్లాప్‌గా నిలిచింది. ఎంతలా అంటే.. రూ.180 కోట్ల భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ఈ చిత్రంలో వారం రోజుల్లో రూ.50 కోట్ల వసూళ్లని కూడా సాధించలేకపోయింది. అలాగే మరో కారణంతో అక్షయ్ సినిమాని సైతం బాయ్‌కాట్ చేశారు. ఆ మూవీ సైతం వారం రోజుల్లో బడ్జెట్‌లో సగం కలెక్షన్లని కూడా సాధించలేకపోయింది.


అనంతరం కొన్ని రోజులక్రితం ఆమీర్ సినిమా చూసిన హృతిక్ రోషన్.. ‘లాల్ సింగ్ చడ్డా చాలా బావుంది. కచ్చితంగా చూడండి’ అంటూ ఆ సినిమాని ప్రమోట్ చేశాడు. దాంతో ఆయన ప్రస్తుతం నటిస్తున్న మూవీ ‘విక్రమ్ వేద’ని కూడా బాయ్‌కాట్ చేయాలంటూ ఇటీవల ట్రెండ్ అయ్యింది. తాజాగా షారుఖ్ ఖాన్ (Shah Rukh Khan) సినిమా ‘పఠాన్’ని బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండ్ చేస్తున్నారు. దానికి కారణం గతంలో ఓ ఇంటర్వ్యూలో షారుఖ్ మాట్లాడుతూ.. ‘ఇక్కడ చాలా అసహనం ఉంది. భారత్‌లో అసహనం ఇంకా పెరిగిపోతూనే ఉంది’ అని చెప్పుకొచ్చాడు. దానికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అది చాలామందికి నచ్చలేదు.


దాంతో షారుఖ్ అప్‌కమింగ్ సినిమా ‘పఠాన్ (Pathaan)’ని బాయ్‌కాట్ చేయాలంటూ ట్రెండ్ చేయడం ప్రారంభించారు. అందులో.. ‘నిజంగా అసహనం ఉంటే.. షారుఖ్ ఖాన్ ఇంకా భారత్‌లోనే ఎందుకు ఉన్నాడు’ అంటూ కొందరూ.. ముగ్గురు ఖాన్ పని అయిపోయిందంటూ మరికొందరూ ట్రెండ్ చేస్తున్నారు. అలాగే మరోవైపు షారుఖ్ సపోర్టుగా పఠాన్‌ని నెం.1గా ట్రెండ్ చేయండి అంటూ కొందరూ.. పఠాన్ కోసం భారత్ వెయిట్ చేస్తోందంటూ మరికొందరూ షారుఖ్ ఫ్యాన్స్ పోస్టులు పెడుతున్నారు.










Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International

BollywoodLatest News in Teluguమరిన్ని...