Shah Rukh Khan ఇంట్లో ఏకంగా అన్ని టీవీలు ఉన్నాయా..? వాటి కోసం రూ.40 లక్షలు ఖర్చు పెట్టాడట..!

Published: Fri, 27 May 2022 13:51:04 ISTfb-iconwhatsapp-icontwitter-icon
Shah Rukh Khan ఇంట్లో ఏకంగా అన్ని టీవీలు ఉన్నాయా..? వాటి కోసం రూ.40 లక్షలు ఖర్చు పెట్టాడట..!

బాలీవుడ్‌లోని స్టార్ హీరోల్లో షారుఖ్ ఖాన్‌ (Shah Rukh Khan)కి ఉన్న పాపులారిటీ గురించి తెలిసిందే. ఇండస్ట్రీలో ఎటువంటి సపోర్టు లేకుండా ఎదిగిన ఈ నటుడిని అభిమానులు ప్రేమగా బాలీవుడ్ బాద్ షా, కింగ్ ఖాన్ అని పిలుచుకుంటూ ఉంటారు. అంతేకాదు.. ఆయన ఏం చేసినా అదే స్థాయిలో ఉంటుంది. తాజాగా షారుఖ్ తన ఇంట్లో ఉన్న టీవీల సంఖ్య గురించి, వాటి ధర గురించి తెలిపి అభిమానులను షాక్‌కి గురి చేశాడు.


తాజాగా షారుఖ్ ఓ బ్రాండ్ ఈవెంట్‌లో పాల్గొన్నాడు. అందులో మాట్లాడుతూ.. ‘నాకు బెడ్‌రూమ్‌లో ఒక టీవీ ఉంది. నా గదిలో ఒకటి ఉంది. నా చిన్న కొడుకు అబ్‌రామ్‌ గదిలో మరొకటి ఉంది. అలాగే ఆర్యన్‌ గదిలో, నా కుమార్తె గదిలో ఒక్కొటి చొప్పున ఉన్నాయి. ఇటీవలే నా జిమ్‌లో ఉన్న ఇతర కంపెనీల టీవీలు పాడైపోయాయి. దాని కోసమే వేచి చూస్తున్న నేను వెంటనే ఎల్‌జీని కంపెనీ టీవీని కొనుగోలు చేశాను. ఇలా పాతది పాడైన పోయిన ప్రతిసారి వెంటనే వెళ్లి కొత్త టీవీని కొంటూనే ఉంటా. ఇప్పటికీ నా ఇంట్లో మొత్తం 11 లేదా 12 టీవీలు ఉన్నాయి. ఒక్కోదాని ధర లక్ష నుంచి లక్షన్నర ఉంటుంది. అంటే ఈ లెక్కన నేను కేవలం టీవీల కోసమే దాదాపు 30 నుంచి 40 లక్షల రూపాయలు ఖర్చు చేశాను’ అని చెప్పుకొచ్చాడు.


షారుఖ్ ఏం చేసినా, ఏం మాట్లాడినా వెంటనే వైరల్ అవ్వడం మామూలే కదా. అన్నింటిలాగే దీనికి సంబంధించిన వీడియో సైతం నెట్టింట వైరల్‌ (Viral)గా మారింది. దీంతో ఎంతోమంది నెటిజన్లు కామెంట్స్, ట్వీట్స్ చేయడం ప్రారంభించారు. అందులో ఓ నెటిజన్ అయితే.. ‘షారుఖ్ దగ్గర 30 నుంచి 40 లక్షల విలువ చేసే టీవీలు ఉన్నాయా? ఇది చూస్తే నేను చాలా పేదవాడిని అనిపిస్తోంది’ అంటూ ట్వీట్ (Tweet) చేశాడు. మరొకరు.. ‘ఆ టీవీల ధర మా ఇంటి ధర అంత ఉంది’ అని.. అందుకే ‘కింగ్ ఖాన్’ అంటారని ఇంకొకరు కామెంట్స్ చేశారు.


Follow Us on:
ABN Youtube Channels ABN Indian Kitchen ABN Entertainment Bindass NewsBindass News ABN Something Special ABN Devotional ABN Spiritual Secrets ABN Telugu ABN Telangana ABN National ABN International