
నేచురల్ స్టార్ నాని హీరోగా రూపొందిన 'జెర్సీ' చిత్రం ఎటువంటి విజయాన్ని అందుకుందో తెలిసిందే. నానిలోని సరికొత్త కోణాన్ని ఎమోషనల్గా చూపించిన చిత్రమది. ఇప్పుడిదే చిత్రాన్ని హిందీలో షాహిద్ కపూర్ హీరోగా రీమేక్ చేస్తున్నారు. అల్లు అరవింద్, దిల్రాజు, అమన్ గిల్ కూడా ఈ సినిమాకు నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. తెలుగులో 'జెర్సీ' చిత్రాన్ని డైరెక్ట్ చేసిన డైరెక్టర్ గౌతమ్ తిన్ననూరే.. హిందీలోనే ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఈ సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. ఈ ఏడాది దీపావళి సందర్భంగా నవంబర్ 5న 'జెర్సీ' సినిమాను విడుదల చేస్తున్నామని షాహిద్ కపూర్ ట్విట్టర్ ద్వారా అధికారికంగా ప్రకటించాడు. మృణాల్ ఠాకూర్ హీరోయిన్గా నటిస్తుంది. ఇప్పటికే తెలుగు దర్శకుల్లో భాగమతి రీమేక్ దుర్గామతి చిత్రంతో అశోక్, అర్జున్ రెడ్డి రీమేక్ కబీర్ సింగ్తో సందీప్ వంగా దర్శకులుగా పరిచయం అయ్యారు. ఇప్పుడు 'జెర్సీ'తో గౌతమ్ తిన్ననూరి తన అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాడు.