నాకేం కాలేదు.. ఆ వార్తలు నమ్మవద్దు: షకీలా

Jul 30 2021 @ 22:42PM

సౌత్‌ ఇండియన్‌ మూవీలో సెక్సీ క్వీన్‌గా గుర్తింపు పొందిన నటి షకీలా. తమిళ, తెలుగు, మలయాళం, కన్నడ ఇలా ప్రతి ఒక్క భాషలోనూ అనేక చిత్రాల్లో ఆమె నటించారు. ఇపుడు సినిమా అవకాశాలు పెద్దగా లేవు. దీంతో టీవీ సీరియళ్ళతో పాటు ఒకటి అరా చిత్రాల్లో నటిస్తున్నారు. ఈ నేపథ్యంలో షకీలా తీవ్ర అనారోగ్యానికి గురయ్యారనీ, ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్టు వార్తలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. తన ఆరోగ్యంపై వచ్చిన వదంతులను ఆమె ఖండించారు. ‘‘నేను చాలా సంతోషంగా, ఆరోగ్యంగా ఉన్నాను’’ అని నటి షకీలా ఓ వీడియో విడుదల చేశారు.


‘‘నేను మరణించాననే వార్తలు విన్నాను. అటువంటిది ఏమీ లేదు. నా ముఖంలో చిరునవ్వును చూడండి. ఎవరో నా గురించి తప్పుడు సమాచారాన్ని ప్రచారం చేశారు. దాంతో నాకు చాలా ఫోనులు చేశారు. సందేశాలు పంపారు. నాపై ప్రేమ చూపించిన వాళ్లందరికీ థాంక్స్‌. నా గురించి ఫేక్‌ న్యూస్‌ ప్రచారం చేసిన వ్యక్తికీ థాంక్స్‌. ఎందుకంటే... ప్రజలు నా గురించి ఆలోచించేలా చేశాడు’’ అని షకీలా పేర్కొన్నారు. 

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.