స్కూలుకు వెళ్లిన ఆరేళ్ల కూతురు.. కొద్ది గంటల్లోనే నగ్నంగా ఇంటికి.. ఏడుస్తూనే టీచర్ నిర్వాకం గురించి ఆ బాలిక చెప్పింది విని..

ABN , First Publish Date - 2022-08-28T20:21:37+05:30 IST

ఆరేళ్ల చిన్నారి. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. పాఠశాలలో దిగబెట్టి వచ్చిన కొద్ది సేపటికే.. ఆ చిన్నారి నగ్నంగా ఏడుస్తూ ఇంటికి రావడాన్ని చూసి తల్లి షాకైంది. కూతురు చె

స్కూలుకు వెళ్లిన ఆరేళ్ల కూతురు.. కొద్ది గంటల్లోనే నగ్నంగా ఇంటికి.. ఏడుస్తూనే టీచర్ నిర్వాకం గురించి ఆ బాలిక చెప్పింది విని..

ఇంటర్నెట్ డెస్క్: ఆరేళ్ల చిన్నారి. స్థానికంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. పాఠశాలలో దిగబెట్టి వచ్చిన కొద్ది సేపటికే.. ఆ చిన్నారి నగ్నంగా ఏడుస్తూ ఇంటికి రావడాన్ని చూసి తల్లి షాకైంది. కూతురు చెప్పింది విని విస్తుపోయింది. ఆ తర్వాత ఏమైంది. అసలు ఇంతకూ ఏం జరిగిందనే పూర్తి వివరాల్లోకి వెళితే.. 



మిజోరామ్‌లోని లుంగ్లీ(Lunglei) జిల్లాకు చెందిన చిన్నారి.. స్థానిక ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి చదువుతోంది. ఈ చిన్నారిని ఆగస్ట్ 22న స్కూల్‌లో ఓ విద్యార్థి ఏడిపించడంతో.. మూడు రోజులపాటు స్కూల్‌కు వెళ్లలేదు. తర్వాత తల్లి బుజ్జగించి.. స్కూల్ వద్దకు వెళ్లి మరీ చిన్నారిని బడికి పంపింది. ఆమె ఇంటికి తిరిగొచ్చిన కొద్ది సమయానికే.. కూతురు ఏడుస్తూ నగ్నంగా రావడాన్ని చూసి షాకైంది. అనంతరం చిన్నారి చెప్పింది విని ఆ తల్లి విస్తుపోయింది. స్కూల్‌లో పని చేసే ఉపాధ్యాయుడు దుస్తులు తీయించినట్టు తెలుసుకుని ఆగ్రహానికి లోనైంది. విషయం గ్రామ ప్రజలకు చెప్పి, సదరు ఉపాధ్యాయుడిపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో కేసు నమోదు చేసుకున్న అధికారులు ఆ ఉపాధ్యాయుడిని అరెస్ట్ చేశారు.


Updated Date - 2022-08-28T20:21:37+05:30 IST