తనకంటే మోసినే మెరుగైన బౌలర్ అన్న Shami: ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన కోచ్

ABN , First Publish Date - 2022-05-04T02:02:04+05:30 IST

ప్రస్తుతం జరుగుతున్న IPL 2022లో బంతితో కొందరు కుర్రాళ్లు అద్భుతం చేస్తూ అభిమానుల మదిని

తనకంటే మోసినే మెరుగైన బౌలర్ అన్న Shami: ఆసక్తికర విషయాన్ని వెల్లడించిన కోచ్

ముంబై: ప్రస్తుతం జరుగుతున్న IPL 2022లో బంతితో కొందరు కుర్రాళ్లు అద్భుతం చేస్తూ అభిమానుల మదిని దోచుకుంటున్నారు. Umran Malikతో మొదలు గతంలో ఎప్పుడూ వినని పేర్లు ఇప్పుడు వినిపిస్తున్నాయి. ప్రపంచంలోనే అత్యుత్తమ బ్యాటర్లుగా చెబుతున్న వారిని సైతం వీరు తమ పదునైన బంతులతో కంగారుపెడుతున్నారు. ఇలాంటి వారిలో లక్నో సూపర్ సెయింట్స్ పేసర్ Mohsin Khan కూడా ఉన్నాడు. వాంఖడే స్టేడియంలో Delhi Capitalతో జరిగిన మ్యాచ్‌లో 23 ఏళ్ల మోసిన్ ఖాన్ అద్భుతంగా రాణించి అందరి దృష్టిని ఆకర్షించాడు. 


ఈ హై స్కోరింగ్ మ్యాచ్‌లో మొత్తంగా 40 ఓవర్లలో 384 పరుగులు నమోదయ్యాయి. ఈ మ్యాచ్‌లో మోసిన్ నాలుగు ఓవర్లు వేసి 16 పరుగులు మాత్రమే ఇచ్చి నాలుగు వికెట్లు నేలకూల్చాడు. అతడి బంతికి పెవిలియన్ చేరిన వారిలో డేవిడ్ వార్నర్, రిషభ్ పంత్, రోవ్‌మన్ పావెల్, శార్దూల్ ఠాకూర్ ఉన్నారు. మోసిన్ చిన్ననాటి కోచ్ బద్రుద్దీన్ సిద్దిఖీ తాజాగా మాట్లాడుతూ.. లాక్‌డౌన్ సమయంలో షమీ, మోసిన్ తన వద్ద శిక్షణ పొందినట్టు చెప్పారు. ఈ సందర్భంగా షమీ తనతో  మాట్లాడుతూ.. మోసిన్ తన కంటే మెరుగైన బౌలర్ అని, కాకపోతే మరింత ఫోకస్ అవసరమని అన్నాడని గుర్తు చేసుకున్నారు. 


అప్పుడు తాను మోసిన్‌ను పిలిచి షమీ నుంచి ఏం కావాలనుకుంటే అది నేర్చుకోవచ్చని చెప్పానని సిద్దిఖీ అన్నారు. అయితే, ఆ తర్వాత పరిస్థితుల్లో మార్పు వచ్చిందన్నారు. కాగా, మోసిన్ తమ జట్టు తరపున ఇప్పటి వరకు నాలుగు మ్యాచ్‌లు ఆడాడు. 6 ఎకానమీతో 8 వికెట్లు పడగొట్టాడు. 

Read more