శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ కరెన్సీ పట్టివేత

ABN , First Publish Date - 2022-01-04T14:07:58+05:30 IST

శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో విదేశీ కరెన్సీ పట్టుబడింది.

శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌లో విదేశీ కరెన్సీ పట్టివేత

హైదరాబాద్: శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయంలో భారీగా విదేశీ కరెన్సీ పట్టుబడింది. హైదరాబాద్ నుండి షార్జా వెళ్తున్న మహమ్మద్ నజీర్ అనే వ్యక్తిని  సీఐఎస్ఎఫ్ సెక్యూరిటీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. షార్జా వెళ్లేందుకు ఎయిర్‌పోర్టుకు వచ్చిన నజీర్ బ్యాగేజ్‌ను అధికారులు చెక్ చేయగా...అందులో అక్రమంగా తరలిస్తున్న సౌది రియాల్ బయపడింది. కరెన్సీని స్వాధీనం చేసుకున్న అధికారులు నిందితుడిని కస్టమ్స్ అధికారులకు అప్పగించారు. నిందితుడిని అదుపులోకి తీసుకున్న కస్టమ్స్ అధికారులు విచారణ చేపట్టారు. పట్టుబడ్డ కరెన్సీ విలువ 34.49 లక్షలు ఉంటుందని కస్టమ్స్ అధికారులు అంచనా వేశారు.

Updated Date - 2022-01-04T14:07:58+05:30 IST