శంషాబాద్‌లో కరుడు గట్టిన పాత నేరుస్థుడి అరెస్ట్

ABN , First Publish Date - 2021-12-22T02:53:49+05:30 IST

రివాల్వర్ బుల్లెట్లు కలిగి ఉన్నాడన్న విశ్వశనీయ సమాచారంతో కరుడు గట్టిన పాత నేరస్థుడిని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి ..

శంషాబాద్‌లో కరుడు గట్టిన పాత నేరుస్థుడి అరెస్ట్

హైదరాబాద్: రివాల్వర్ బుల్లెట్లు కలిగి ఉన్నాడన్న విశ్వశనీయ సమాచారంతో  కరుడు గట్టిన పాత నేరస్థుడిని శంషాబాద్ ఎస్ఓటీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. రాజేంద్రనగర్‌కు చెందిన రౌడీ షీటర్‌ను హత్య చేసేందుకు రివాల్వర్‌ను కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. రెండు కంట్రి‌మేడ్ పిస్తోల్స్‌తో పాటు 44 లైవ్ బుల్లెట్లను స్వాధీనం చేసుకుని నిందితుడిని ఆర్జీఐఏ పోలీసులకు అప్పగించారు. 


శంషాబాద్ డీసీపీ ఎన్ ప్రకాష్ రెడ్డి తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. తనను హతమార్చేందుకు ప్రయత్నిస్తున్న రౌడీ షీటర్‌ను చంపేందుకు ఫారుఖ్ పథకం రూపొందించుకున్నాడు. ఈ మేరకు ఉత్తర్ ప్రదేశ్ మీరట్‌కు చెందిన ఫైజల్ అనే వ్యక్తి నుంచి 35 వేల రూపాయలతో రెండు కంట్రి మేడ్ పిస్తోల్స్‌ను ఒక్కొక్క బుల్లెట్ రూ. 300 చొప్పున 44 బుల్లెట్లను కొనుగోలు చేశాడు. ఎనిమిది రోజులుగా పథకం అమలుకు ప్రయత్నం చేస్తున్నాడు. 



మహమ్మద్ ఫారుఖ్ హైమద్ గత చరిత్ర

మహబూబ్ నగర్ జిల్లా‌కు చెందిన మహమ్మద్ ఫారుఖ్ హైమద్ అలియాస్ జావిద్, అలియాస్ సైతాన్ ఆరుఖ్ వృత్తి రిత్యా రియల్ ఎస్టేట్ బ్రోకర్. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధి గగన్ పహాడ్ సమీపంలోని డ్రీమ్ ఇండియా అవెన్యూ‌లో నివాసం ఉంటూ వ్యాపారం చేస్తుంటాడు. 2005లో దుబాయ్ వెళ్లిన ఫారుఖ్ 2011లో ఇండియాకు తిగిరి వచ్చాడు. అనంతరం రియల్ ఎస్టేట్ బ్రోకర్‌గా మారాడు. వ్యాపారంలో నష్టపోయిన ఫారుఖ్ డబ్బులు చెల్లించలేక క్రిమినల్‌గా మారాడు. 2016లో రాజేంద్రనగర్‌కు చెందిన ఖదీర్ అనే వ్యక్తి వద్ద వెపన్‌ను కొనుగోలు చేశారు. ఆ తర్వాత  మహబుబ్‌నగర్, కల్వకుర్తిలో ఒకే రోజు రెండు హత్యలు చేశాడు. అనంతరం అరెస్ట్ అయి బెయిల్‌పై బయటకు వచ్చాడు. జైలు నుంచి వచ్చిన తర్వాత కూడా  ఫారుఖ్ తన పంతాని ఏమాత్రం మార్చుకోలేదు. ఉత్తర ప్రదేశ్ మీరట్‌కు చెందిన ఫైజల్ అనే వ్యక్తి నుంచి మూడు వెపన్స్‌ను కొనుగోలు చేసి మహబూబ్‌నగర్, జడ్చర్ల, వంగూర్‌, సైబరాబాద్ అర్జీఐఏ పరిధిలోనూ, హైదరాబాద్ కమిషనరేట్ పరిధిలోని సైఫాబాద్, ఉమాయినగర్, నాంపల్లి పరిధిలో దొంగతనాలతో పాటు ఇతర నేరాలకు పాల్పడి 2018లో పోలీసులకు పట్టబడ్డాడు. ఫారుఖ్ చేసిన నేరాలకు గాను హైదరాబాద్ పోలీసులు పీడీ యాక్ట్ విధించారు. 2019లో బెయిల్‌పై వచ్చిన ఫారూఖ్ నేరాలు చేస్తూనే ఉన్నాడు. 


Updated Date - 2021-12-22T02:53:49+05:30 IST