శంషాబాద్‌లో పెద్దపులి కలకలం

ABN , First Publish Date - 2020-11-28T12:48:46+05:30 IST

శంషాబాద్‌లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది.

శంషాబాద్‌లో పెద్దపులి కలకలం

హైదరాబాద్: శంషాబాద్‌లో పెద్దపులి సంచారం కలకలం రేపుతోంది. శంషాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని ఇందిరమ్మ  కాలనీ సమీపంలోని నిర్మానుష ప్రాంతంలో పెద్దపులి కనిపించింది అంటూ కొంతమంది స్థానికులు భయాందోళనకు గురై పరుగులు తీశారు. మూడు ఫీట్ల ఎత్తులో గాంభీరంగా ఉందని స్థానికులు తెలిపారు. పెద్ద పులిని చూసి స్థానికులు పరుగులు తీశారు. పెద్దపులి సంచారంతో బిక్కుబిక్కుమంటూ ఇంట్లోనే గడుపుతున్నామని స్థానికులు తెలిపారు.

Updated Date - 2020-11-28T12:48:46+05:30 IST