Zero covid cases: షాంఘాయ్‌లో తొలిసారిగా..

ABN , First Publish Date - 2022-06-26T03:23:38+05:30 IST

కరోనా కట్టడి కోసం విపరీతంగా శ్రమిస్తున్న చైనాలో ఓ శుభపరిణామం చోటుచేసుకుంది.

Zero covid cases:  షాంఘాయ్‌లో తొలిసారిగా..


ఎన్నారై డెస్క్: కరోనా కట్టడి కోసం విపరీతంగా శ్రమిస్తున్న చైనాలో ఓ శుభపరిణామం చోటుచేసుకుంది. మార్చి తరువాత తొలిసారిగా షాంఘాయ్ నగరంలో శనివారం నాడు ఒక్క కరోనా కేసు కూడా నమోదు కాలేదు. ఈ నెల మొదట్లోనే అక్కడ విధించిన పూర్తి స్థాయి లాక్‌ డౌన్‌ను ఎత్తేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అక్కడ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కరోనా ఉపద్రవాన్ని కట్టడి చేసే క్రమంలో చైనా జీరో కోవిడ్ పాలసీని అనుసరిస్తోంది. ఈ క్రమంలోనే లాక్‌డౌన్‌లు కూడా విధించింది. 

Updated Date - 2022-06-26T03:23:38+05:30 IST