వంటలు
శంకరపాలి

కావలసిన పదార్థాలు: మైదా- కప్పున్నర, రవ్వ- ముప్పావు కప్పు, చక్కెర- అర కప్పు, ఉప్పు- చిటికెడు, పాలు- నాలుగు స్పూన్లు, నెయ్యి- రెండు స్పూన్లు, నూనె, నీళ్ళు- తగినంత.


తయారుచేసే విధానం: చక్కెరను మిక్సీలో వేసి పొడి చేసుకోవాలి. ఓ గిన్నెలో మైదా పిండి, రవ్వ, ఉప్పు, కాచిన నెయ్యిని వేసి బాగా కలపాలి. చక్కెర పొడి జతచేయాలి. పాలను వేసి చపాతీ పిండిలా కలుపుకోవాలి. ఓ ఇరవై నిమిషాలు మూత పెట్టి పక్కన పెట్టాలి. ఓ మోస్తరు ముద్దలుగా చేసుకుని రోటీలా వత్తుకుని దాన్ని కత్తితో ముక్కలుగా కోయాలి. వీటిని నూనెలో వేయించి తీస్తే శంకరపాలి తయ్యార్‌.

Follow Us on:
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.