షేప్‌ ఆఫ్‌ ఎయిర్‌

Jul 28 2021 @ 00:36AM

ప్పుడిప్పుడే ప్రపంచం కరోనా నుంచి కోలుకొంటోంది. నిన్నమొన్నటి వరకు స్తబ్దుగా ఉన్న ఫ్యాషన్‌ రంగం మళ్లీ పూర్వ వైభవాన్ని సంతరించుకొంటోంది. డిజైనర్లు కూడా ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా కలెక్షన్లు రూపొందిస్తున్నారు. అలాంటి ఓ అబ్బుర పరిచే ఫ్యాషన్లకు వేదికగా నిలిచింది ఇటీవల జరిగిన ‘ప్యారిస్‌ హాట్‌ కల్చర్‌ వీక్‌’. ఇందులో భారత ప్రముఖ డిజైనర్‌ రాహుల్‌ మిశ్రా కలెక్షన్‌ ప్రత్యేక ఆకర్షణ. ప్రకృతిని స్ఫూర్తిగా తీసుకుని ‘ది షేప్‌ ఆఫ్‌ ఎయిర్‌’ పేరుతో ఆయన ఈ కలెక్షన్‌ రూపొందించాడు. విశేషమేమంటే ఈ ఫ్యాషన్‌ షోలో వెరైటీలను ప్రదర్శించడానికి ఆహ్వానం అందుకున్న మొదటి భారతీయ డిజైనర్‌ రాహుల్‌ మిశ్రానే కావడం. డిజిటల్‌ తెరలే వేదికగా సాగిన ఫ్యాషన్‌ షో... ఇలాంటి ఎన్నో వినూత్న డ్రెస్సులతో ఆకట్టుకుంది.

Follow Us on:
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.