భక్తి శ్రద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాలు

ABN , First Publish Date - 2022-10-04T05:42:02+05:30 IST

దసరా శరన్నవరాత్రి వేడుక లను మండలంలో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు.

భక్తి శ్రద్ధలతో శరన్నవరాత్రి ఉత్సవాలు
అద్దంకిలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవస్థానంలో దుర్గాదేవిగా అమ్మవారు

దుర్గాదేవీగా దర్శనమిచ్చిన అమ్మవారు

భక్తులతో కిక్కిరిసిన ఆలయాలు

పర్చూరు, అక్టోబరు 3: దసరా శరన్నవరాత్రి వేడుక లను మండలంలో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటున్నారు. పర్చూరులోని అద్దంకి నాంచారమ్మ అమ్మవారి దేవ స్థానంలో సోమవారం అ మ్మవారిని దుర్గాదేవిగా అ లంకరించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. వాసవీ క న్యకాపరమేశ్వరి ఆలయం లోనూ దుర్గాదేవి అలంకర ణలో భక్తులకు దర్శనిమి చ్చారు. రామాలయం వీధి లో ఏర్పాటుచేసిన అమ్మవా రి విగ్రహం వద్ద భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని పూజా కార్యక్రమాలు నిర్వ హించారు. అడుసుమల్లి గ్రామంలో వేంచేసియున్న గంగాపార్వతి సమేత గౌరీ శంకర అలయంలో అమ్మవారిని దుర్గాదేవిగా అలంక రించి విశిష్టపూజాలు చేశారు. 

అద్దంకి: దసరా  శరన్నవరాత్రుల సందర్భంగా అద్దంకిలోని శ్రీచక్ర సహిత శ్రీవాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయం, దత్తపాదుకా క్షేత్రంలలో అమ్మవార్లను దుర్గాదేవి అలంకారంలో అలంకరించారు. వాసవి కన్య కాపరమేశ్వరి దేవాలయంలో  కుంకుమార్చన, చండీ యాగం నిర్వహించారు. భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొ న్నారు. పట్టణంలోని కమఠే శ్వరాలయం, వేయిస్తంభా ల గుడి, పోలేరమ్మ దేవాలయం తదితర దేవాలయా లలో అమ్మవార్లను ప్రత్యేకంగా అలంకరించారు.

పోలూరు(పర్చూరు): శరన్నవరాత్రి ఉత్సవాలు య ద్దనపూడి మండలంలో ఘనంగా జరుగుతున్నాయి. పోలూరు గ్రామంలోని రేణుకమ్మ అలయంలో అమ్మ వారిని కనకదుర్గమ్మగా అలంకరించి పూజాకార్య క్రమాలు నిర్వహించా రు. అనంతరం భక్తులకు తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు. 

చినగంజాం: మండ లంలోని ఆలయాల్లో ద సరా పండుగను పురస్క రించుకొని శరన్నవ రా త్రులు ఉత్సవాలను ఘ నంగా నిర్వహిస్తున్నారు. స్థానిక వాసవి కన్యకాప రమేశ్వరి మందిరంలో అమ్మవారిని గజలక్ష్మీ దేవిగా అలంకరించి భ క్తులకు దర్శనం కల్పిం చారు. మందిరంలోని బతుకమ్మ అమ్మవారిని మహిళా భక్తులు ప్రత్యేకంగా అలంకరించి పూజలు నిర్వహించారు. సోపిరాలలోని రామకోటేశ్వరస్వామి ఆ లయంలో దుర్గాదేవిగా కొలువుదీరిన లలితా పరమే శ్వరి అమ్మవారని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. 

గొనసపూడి, పల్లెపాలెం, పెదగంజాం, నీలాయ పాలెం, కడవకుదురు తదితర గ్రామాల్లో వివిధ రూపాల్లో అలంకరించిన అమ్మవార్లకు భక్తులు ప్రత్యేక పూజలు చేశారు.

పంగులూరు, అక్టోబరు 3: మండలంలోని పలు గ్రామాలలో దేవీ శరన్నవరాత్రి ఉత్సవాలు సోమవా రం ఘనంగా జరిగాయి. పంగులూరులోని భీమలింగే శ్వరస్వామి ఆలయంలో పార్వతీ అమ్మవారు దుర్గాదేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు. అమ్మవారికి జాగర్లమూడి సుబ్బారావు, కర్రి శ్రీనివాసరావు దంప తులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. 

ముప్పవరంలో శ్రీలక్ష్మీగణపతి షిర్డీసాయి ఆలయం లో అమ్మవారికి యామిని నాగేశ్వరరావు దంపతులు, గ్రామంలోని భక్తులు సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Updated Date - 2022-10-04T05:42:02+05:30 IST