దీనికంటే ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడమే సులభం: శార్దూల్ ఠాకూర్

ABN , First Publish Date - 2021-01-24T18:18:27+05:30 IST

ట్రైన్‌లో సీట్ పొందండం కంటే ఆసీస్ బౌలర్లను ఎదుర్కోవడమే సులభమని టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ అన్నాడు. ట్రైన్‌లో సీట్ దక్కించుకోవాలంటే ఎంతో నైపుణ్యం, సమయస్ఫూర్తి ఉండాలని శార్దూల్ చెప్పాడు. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోనే...

దీనికంటే ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోవడమే సులభం: శార్దూల్ ఠాకూర్

ఇంటర్నెట్ డెస్క్: ట్రైన్‌లో సీట్ పొందండం కంటే ఆసీస్ బౌలర్లను ఎదుర్కోవడమే సులభమని టీమిండియా బౌలర్ శార్దూల్ ఠాకూర్ అన్నాడు. ట్రైన్‌లో సీట్ దక్కించుకోవాలంటే ఎంతో నైపుణ్యం, సమయస్ఫూర్తి ఉండాలని శార్దూల్ చెప్పాడు. ఫాస్ట్ బౌలర్లను ఎదుర్కోనే సమయంలో కంటే ట్రైన్‌లో సీట్ దొరకబుచ్చుకునేందుకే ఎక్కువ శ్రమ పడాల్సి ఉంటుందని చెప్పుకొచ్చాడు. ఈ మేరకు శార్దూల్ శనివారం తన సోషల్ మీడియాలో ఓ పోస్ట్ పెట్టాడు. ప్రస్తుతం ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది. ఇదిలా ఉంటే ఇటీవల ఆస్ట్రేలియాతో జరిగిన బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ నాలుగో టెస్ట్ మొదటి ఇన్నింగ్స్‌లో శార్దూల్ అద్భుత బ్యాటింగ్‌తో అదరగొట్టాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు వాషింగ్టన్ సుందర్‌తో కలిసి 123 పరుగులు భాగస్వామ్యం నెలకొల్పాడు. అందుల్లో 67 పరుగులు శార్దూల్ ఖాతాలో ఉన్నాయి. ఈ స్కోరుతో భారత్ పటిష్ఠ స్థితిలో నిలిచింది. ఆ తరువాత బౌలింగ్‌లోనూ శార్దూల్ 4 వికెట్లతో రాణించాడు. 

Updated Date - 2021-01-24T18:18:27+05:30 IST