ఆమ్నెస్టీ‌పై క్లారిటీ ఇచ్చిన షార్జా అధికారులు

ABN , First Publish Date - 2022-01-03T16:15:31+05:30 IST

చట్టవిరుద్ధంగా షార్జాలో నివసిస్తున్న వారికి షార్జా తీపి కబురు చెప్పిందని.. కొంత మొత్తం చెల్లించి, శిక్ష నుంచి తప్పించుకోవచ్చనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆసియాకు చెందిన వర్కర్లు.. పె

ఆమ్నెస్టీ‌పై క్లారిటీ ఇచ్చిన షార్జా అధికారులు

ఎన్నారై డెస్క్: చట్టవిరుద్ధంగా షార్జాలో నివసిస్తున్న వారికి షార్జా తీపి కబురు చెప్పిందని.. కొంత మొత్తం చెల్లించి, శిక్ష నుంచి తప్పించుకోవచ్చనే వార్త సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. దీంతో ఆసియాకు చెందిన వర్కర్లు.. పెధ్ద సంఖ్యలో ప్రభుత్వ కార్యాలయాల వద్దకు చేరుకుని, ఈ విషయంపై ఆరా తీస్తున్నారు. ఈ నేపథ్యంలో షార్జా పోలీసు అధికారులు స్పందించారు. ఇంటర్నెట్‌లో చక్కర్లు కొడుతున్న ఆమ్నెస్టీ వార్తలను ఖండించారు. ప్రభుత్వం అటువంటి ప్రకటన చేయలేదని స్పష్టం చేశారు. సోషల్ మీడియాలో వైరల్ అయ్యే వాటిని గుడ్డిగా నమ్మొద్దని సూచించారు. ఇదే సమయంలో సోషల్ మీడియాలో తప్పుడు ప్రచారం చేసే వారిని ఉద్దేశించి హెచ్చరించారు. తప్పుడు ప్రచారాలకు పాల్పడే వారిని పట్టుకునే టెక్నాలజీ తమ వద్ద ఉందనీ.. పుకార్లు సృష్టిస్తే చర్యలు తప్పవని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇటువంటి నేరాలకు పాల్పడితే.. జైలు శిక్షతోపాటు భారీ మొత్తంలో జరిమానా కూడా కట్టాల్సి ఉంటుందని పేర్కొన్నారు. 




Updated Date - 2022-01-03T16:15:31+05:30 IST