Ashneer Grover: కోహ్లీని కలిసిన అష్నీర్ గ్రోవర్.. ఏం మాట్లాడుకున్నారో తెలియాలంటున్న నెటిజన్లు

ABN , First Publish Date - 2022-09-22T22:54:41+05:30 IST

భారత్‌పే (BharatPe) సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ (Ashneer Grover) టీమిండియా మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ(virat kohli)ని

Ashneer Grover: కోహ్లీని కలిసిన అష్నీర్ గ్రోవర్.. ఏం మాట్లాడుకున్నారో తెలియాలంటున్న నెటిజన్లు

న్యూఢిల్లీ: భారత్‌పే (BharatPe) సహ వ్యవస్థాపకుడు అష్నీర్ గ్రోవర్ (Ashneer Grover) టీమిండియా మాజీ స్కిప్పర్ విరాట్ కోహ్లీ(virat kohli)ని కలవడం ట్విట్టర్‌లో తీవ్ర చర్చనీయాంశమైంది. వారిద్దరూ ఏం మాట్లాడుకున్నారన్న చర్చ మొదలైంది. కోహ్లీని కలిసిన గ్రోవర్ (Ashneer Grover) ఆ ఫొటోలను ట్విట్టర్‌లో షేర్ చేశారు. ‘‘బెన్‌స్టోక్స్’ పట్ల సాధారణ అభిరుచి కలిగిన ఇద్దరు ఢిల్లీ కుర్రాళ్లు ఏం చర్చించుకుంటున్నారు? నాగ్‌పూర్‌ మ్యాచ్‌లో కోహ్లీకి మంచి జరిగాలి’’ అని ఆ ట్వీట్‌కు కామెంట్ తగిలించారు. అంతే.. అప్పటి నుంచి సోషల్ మీడియా మోతెక్కిపోతుంది. వారిద్దరూ ఏం చర్చించుకుని ఉంటారన్న ఆసక్తి నెటిజన్లలో మొదలైంది. ఇద్దరూ కలిసి ఓ వ్యాపారం ప్రారంభించబోతున్నారన్న ప్రచారం కూడా మొదలైంది.  


ఈ ట్వీట్‌కు 32 వేలకుపైగా లైకులు రాగా వందలాది రకరకాల కామెంట్లతో ట్విట్టర్‌ను హోరెత్తిస్తున్నారు. వారిద్దరి ఫొటో వెనకున్న బ్యాంక్‌గ్రౌండ్ ఆధారంగా కోహ్లీ (virat kohli), గ్రోవర్ (Ashneer Grover) ఓ పార్టీలో కలుసుకుని ఉండొచ్చని అభిప్రాయపడుతున్నారు. మరికొందరు మాత్రం వారి మధ్య తప్పకుండా వ్యాపారం గురించిన చర్చ జరిగి ఉంటుందని చెబుతున్నారు. 


కాగా, ఆస్ట్రేలియాతో ప్రస్తుతం జరుగుతున్న మూడు మ్యాచ్‌ల టీ20లో భాగంగా మొహాలీలో జరిగిన తొలి మ్యాచ్‌లో కోహ్లీ పేలవ ప్రదర్శనతో అభిమానులను నిరాశపరిచాడు. ఉమేశ్ యాదవ్ బౌలింగులో కేమరాన్ గ్రీన్ వరుసపెట్టి బౌండరీలు బాదుతుంటే కోహ్లీ షాకింగ్ ఎక్స్‌ప్రెషన్ ఇచ్చాడు. ఆ ఎక్స్‌ప్రెషన్ అభిమానులకు మీమ్‌గా మారింది. భారత్-ఆస్ట్రేలియా మధ్య రెండో టీ20 శుక్రవారం (23న) నాగ్‌పూర్‌లో జరుగుతుంది. 



Updated Date - 2022-09-22T22:54:41+05:30 IST