బంగారు తెలంగాణ కాదు.. బాధల తెలంగాణ..: షర్మిల

ABN , First Publish Date - 2022-04-04T19:45:41+05:30 IST

టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు.

బంగారు తెలంగాణ కాదు.. బాధల తెలంగాణ..: షర్మిల

ఖమ్మం జిల్లా: టీఆర్ఎస్ ప్రభుత్వంపై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల తీవ్రస్థాయిలో మండిపడ్డారు. సోమవారం ఖమ్మం జిల్లా, తిరుమలయపాలెం మండలం, కాకరవాయి సభలో మాట్లాడుతూ బంగారు తెలంగాణ కాదని, బాధల తెలంగాణ అని, బార్లు, బీర్లు, ఆత్మహత్యల తెలంగాణగా మారిందని విమర్శించారు. తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యమం చేశారని, రెండుసార్లు కేసీఆర్‌ను ముఖ్యమంత్రిని చేస్తే ప్రజలకు ఆయన చేసిందేమిటని ప్రశ్నించారు. ఎన్నికలప్పుడు గారడి మాటలు తప్ప.. కేసీఆర్ తెలంగాణను ఉద్ధరించేదేమీలేదని దుయ్యబట్టారు. మళ్ళీ కేసీఆర్ మాటలకు మోసపోవద్దని కోరారు. ప్రజలేసిన ఓట్లతో గెలిచి అధికారపార్టీకి పోయిన ఎమ్మెల్యేలను ఏమనాలన్నారు. ఇది రాజకీయ వ్యభిచారం కాదా?... తెలంగాణలో ప్రభుత్వానికి ప్రశ్నించే ప్రతిపక్షాలున్నాయా? అని ప్రశ్నించారు. మాటిస్తే మడమ తిప్పని వైయస్సార్ బిడ్డగా చెప్తున్నా.... మళ్లీ రాజన్న రాజ్యం తెస్తానని షర్మిల స్పష్టం చేశారు.

Updated Date - 2022-04-04T19:45:41+05:30 IST