అత్యాచారాలు, హత్యలను అరికట్టడంతో కేసీఆర్ విఫలం: YS Sharmila

ABN , First Publish Date - 2022-06-09T00:42:02+05:30 IST

Khammam : కేసీఆర్ పాలనలో మహిళలు, బాలికలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని, వాటిని అరికట్టడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని వైఎస్సార్

అత్యాచారాలు, హత్యలను అరికట్టడంతో కేసీఆర్ విఫలం: YS Sharmila

Khammam : కేసీఆర్ పాలనలో మహిళలు, బాలికలపై హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని, వాటిని అరికట్టడంతో ముఖ్యమంత్రి కేసీఆర్ విఫలమయ్యారని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల ఆరోపించారు. ఖమ్మం జిల్లా వైరా నియోజక వర్గంలో ఆమె పర్యటించారు. టీఆర్ఎస్‌ను తాగుబోతుల పార్టీగా అభివర్ణించారు. టీఆర్ఎస్‌ రేపిస్ట్‌ల పార్టీ అని, పనులకోసం వెళితే టీఆర్ఎస్ నేతలు మహిళల మాన ప్రాణాలను అడుగుతున్నారని ఆరోపించారు. 

ఇంకా ఏం మాట్లాడారంటే...

‘‘తెలంగాణలో కేసీఆర్ మోసం చేయని వర్గం లేదు. రుణమాఫీ అని రైతులను మోసం చేశారు. చదువు ఉచితం...ఆరోగ్యం ఉచితం అన్నాడు. మరి ఇచ్చాడా? ఉద్యోగం లేకపోతే రూ.3 వేలు నిరుద్యోగ భృతి అన్నాడు. ఇచ్చాడా? 57 ఏళ్లకు పింఛన్ అన్నాడు. ఇచ్చాడా? అసలు రైతులకు న్యాయం చేయని ఈ ప్రభుత్వం ఎందుకు ఉన్నట్లు? అని కేసీఆర్‌ను పరోక్షంగా ప్రశ్నించారు.

వైరా ఎమ్మెల్యేపై ఘాటు వ్యాఖ్యలు.. 

వైఎస్ షర్మిలా వైరా ఎమ్మెల్యేపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సంతలో పశువులా స్థానిక ఎమ్మెల్యే వైఎస్ఆర్ బొమ్మ పెట్టుకొని కేసీఆర్‌కు అమ్ముడుపోయాడని విమర్శించారు. అనంతరం మాట - ముచ్చట‌ కార్యక్రమంలో భాగంగా గరికేపాడు గ్రామస్థులు వైఎస్ షర్మిలకు తమ సమస్యలు విన్నవించారు. ఇళ్లు లేని వారు గ్రామంలో చాలామంది ఉన్నారని, తమకు న్యాయం జరిగేలా చూడాలని షర్మిలాను కోరారు. భూములు ఉన్న వాళ్ళకే లోన్లు ఇచ్చి...రైతుబంధు ఇస్తున్నారు... భూములు లేని మా పరిస్థితి ఏమిటని? ఇంకొంతమంది గ్రామస్థులు ప్రశ్నించారు. వైరా ఎమ్మెల్యే ఓట్ల కోసం తప్పా ఇంత వరకు రాలేదని, ఎమ్మెల్యే ఎవరో కూడా తాము గుర్తు పట్టే పరిస్థితుల్లో లేమని కొందరు మహిళలు చెప్పారు. 

Updated Date - 2022-06-09T00:42:02+05:30 IST