షర్మిల తెలంగాణలో రోడ్డుపై పడింది: చంద్రబాబు

ABN , First Publish Date - 2021-03-04T23:09:51+05:30 IST

వైఎస్ షర్మిల తెలంగాణలో రోడ్డుపై పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు.

షర్మిల తెలంగాణలో రోడ్డుపై పడింది: చంద్రబాబు

కర్నూలు: వైఎస్ షర్మిల తెలంగాణలో రోడ్డుపై పడిందని టీడీపీ అధినేత చంద్రబాబు అన్నారు. షర్మిలకు ఆస్తులు, పదవులు ఇవ్వకుండా సీఎం జగన్ మోసం చేశారని ఆరోపించారు. కర్నూలులో చంద్రబాబు మున్సిపల్‌ ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌పై నిప్పులు చెరిగారు. జగన్ పిరికి పంద అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్‌కు దమ్ముంటే తన విమర్శలకు సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. మాజీమంత్రి వివేకానందరెడ్డి హత్య కేసులో దోషి ఎవరో ప్రజలకు తెలుసన్నారు. ఏం పీకారని జగన్‌కు ఓటేస్తారని, ఆయనకు దమ్ముంటే ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికలకు రావాలని చంద్రబాబు అన్నారు.


కర్నూలు కార్పొరేషన్‌ పరిధిలో చంద్రబాబు ఎన్నికల ప్రచారం చేస్తున్నారు. పట్టణంలోని పెద్దమార్కెట్‌ ఎదురుగా శ్రీలక్ష్మి నరసింహస్వామి కల్యాణ మండపం వద్దకు చేరుకుని పాతబస్టాండు, గోశా హాస్పిటల్‌, స్టేట్‌ బ్యాంకు, ఎస్టీబీసీ కళాశాల మీదుగా ఐదు రోడ్ల కూడలి, మౌర్యఇన్‌, బంగారు పేట, ఈద్గా, కొత్తబస్టాండు, బళ్లారి చౌరస్తా, చెన్నమ్మ సర్కిల్‌కు వరకు రోడ్‌షోలో పాల్గొంటారు. రోడ్‌షోలో చంద్రబాబు ప్రధాన కూడళ్ల వద్ద ప్రజలతో మాట్లాడుతారు. చెన్నమ్మసర్కిల్‌ వద్ద చైతన్య రథం నుంచి ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. టీడీపీని గెలిపిస్తే చేపట్టే అభివృద్ధి కార్యక్రమాలు, సంక్షేమ పథకాలను ప్రజలకు చంద్రబాబు వివరిస్తారని ఆ పార్టీ నేతలు చెబుతున్నారు.

Updated Date - 2021-03-04T23:09:51+05:30 IST