
Khammam dist.: టీఆర్ఎస్ ప్రభుత్వానికి పేదవాడు అంటే గౌరవం, విలువ లేదని వైఎస్ షర్మిల తీవ్రస్థాయిలో విమర్శించారు. ఖమ్మం జిల్లా, రామనగరం గ్రామంలో రైతు గోస ధర్నాలో పాల్గొన్న ఆమె మాట్లాడుతూ పేదరికం ఒక శాపంలా మారిందని, ఆ శాపంలోనే కూరుకుపొండని పాలకులు ఆజ్ఞపిస్తున్నారని, పాలకులే పేద ప్రజల పట్ల రాక్షసులుగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. ప్రతి గ్రామంలో ఎన్నో సమస్యలు ఉన్నాయని, రుణమాఫీ చేయకపోవడంతో బ్యాంకుల్లో కొత్త రుణాలు ఇవ్వడంలేదన్నారు. అప్పుల మీద అప్పులు రైతుకు కుప్పలుగా మారుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అప్పులు కట్టలేక కొందరు రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఈ ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోవడం లేదని షర్మిల దుయ్యబట్టారు.
ఇవి కూడా చదవండి