నేడు చండూరులో షర్మిల దీక్ష

ABN , First Publish Date - 2021-07-27T06:24:27+05:30 IST

వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్షను ఈ నెల 27న చండూరు మండలం పుల్లెంలలో నిర్వహించనున్నారు.

నేడు చండూరులో షర్మిల దీక్ష

చండూరు: వైఎ్‌సఆర్‌ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల నిరుద్యోగ నిరాహార దీక్షను ఈ నెల 27న చండూరు మండలం పుల్లెంలలో నిర్వహించనున్నారు. అదేవిధంగా ఉద్యోగం లేదనే మనస్తాపంతో ఆత్మహత్య చేసుకున్న పుల్లెంలకు చెందిన పాక శ్రీకాంత కుటుంబ సభ్యులను పరామర్శించి ఆర్థికసాయం అందజేయనున్నారు. ప్రతి మంగళవారం నిరుద్యోగుల కోసం నిర్వహిస్తున్న నిరాహార దీక్షలో భాగంగా ఆమె పుల్లెంలకు వస్తున్నారు. పార్టీ ఏర్పాటు అనంతరం అధ్యక్షురాలి హోదాలో మొదటిసారి జిల్లాకు వస్తుండటంతో భారీ స్వాగతం పలికేందుకు పార్టీ శ్రేణులు ఏర్పాట్లు పూర్తిచేశాయి.

Updated Date - 2021-07-27T06:24:27+05:30 IST