పోరాటాలకు ఎంతటి నియంత పాలకులైనా తలవంచాల్సిందే: షర్మిల

ABN , First Publish Date - 2022-03-10T00:58:58+05:30 IST

పోరాటాలకు ఎంతటి నియంత పాలకులైనా తలవంచాల్సిందేనని వైఎస్‌ఆర్టీపీ అధినేత్రి షర్మిల హెచ్చరించారు.

పోరాటాలకు ఎంతటి నియంత పాలకులైనా తలవంచాల్సిందే: షర్మిల

హైదరాబాద్: పోరాటాలకు ఎంతటి నియంత పాలకులైనా తలవంచాల్సిందేనని వైఎస్‌ఆర్టీపీ అధినేత్రి షర్మిల హెచ్చరించారు. బుధవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ఉద్యోగ నోటిఫికేషన్ల ప్రకటన వైఎస్‌ఆర్టీపీ విజయమన్నారు. పార్టీ పెట్టకముందే నిరుద్యోగుల పక్షాన 3 రోజుల పాటు నిరాహార దీక్షలు చేశామని, పార్టీ పెట్టిన తర్వాత 17 వారాలపాటు నిరాహారదీక్షలు చేశామని  గుర్తుచేశారు. తమ పోరాటాలతోనే ప్రతిపక్షాలకు సోయివచ్చిందని, అధికారపక్షానికి బుద్ధొచ్చిందని షర్మిల చెప్పారు. అసెంబ్లీ సాక్షిగా ఈరోజు మళ్లీ కేసీఆర్‌ అబద్ధాలు చెప్పారని దుయ్యబట్టారు. రాష్ట్రంలో లక్షా 91వేల ఉద్యోగాలు ఖాళీలుంటే... కేవలం 80వేల ఉద్యోగాలే భర్తీ చేస్తానంటున్నారని తప్పుబట్టారు. అవి కూడా నింపుతారనే గ్యారెంటీ లేదన్నారు. నోటిఫికేషన్లపై మాట ఇచ్చినంత మాత్రాన తమ పోరాటం ఆగదని షర్మిల ప్రకటించారు.

Updated Date - 2022-03-10T00:58:58+05:30 IST