Khammam జిల్లా: 96 వ రోజు పాదయాత్ర ప్రారంభించిన Sharmila
ABN , First Publish Date - 2022-06-16T17:21:23+05:30 IST
షర్మిల ఖమ్మం నియోజక వర్గం దంసలాపురం క్యాంప్ నుంచి 96వ రోజు పాదయాత్ర ప్రారంభించారు.
Khammam జిల్లా: వైఎస్సార్టీపీ (YSRTP) అధ్యక్షురాలు షర్మిల (Sharmila) గురువారం, ఖమ్మం నియోజక వర్గం దంసలాపురం క్యాంప్ నుంచి 96వ రోజు పాదయాత్ర (Padayatra) ప్రారంభించారు. ఖమ్మం టౌన్ పరిధిలోని కొత్తూరు, ముస్తఫానగర్, శాంతి నగర్, తుమ్మలగడ్డ, జడ్పీ సెంటర్, పాత బస్టాండ్ సర్కిల్, చర్చి కాంపౌండ్ సెంటర్ మీదుగా పాదయాత్ర సాగనుంది. అనంతరం గురువారం సాయంత్రం 5 గంటలకు పాత బస్టాండ్ సర్కిల్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించనున్నారు.