భేల్‌పూరిపై శశిధరూర్ పసందైన వ్యాఖ్య!

ABN , First Publish Date - 2021-07-25T17:36:07+05:30 IST

భేల్‌పూరి... భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా...

భేల్‌పూరిపై శశిధరూర్ పసందైన వ్యాఖ్య!

న్యూఢిల్లీ: భేల్‌పూరి... భారత్‌లోనే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఆహార ప్రియులకు ఇష్టమైన చిరుతిండి. విదేశాల్లో కూడా భేల్ పూరి దుకాణాలు విరివిగా కనిపిస్తాయి. మన దేశంలో ఫేమస్ స్ట్రీట్ ఫుడ్‌గా భేల్‌పూరి పేరుగాంచింది. తాజాగా భేల్‌పూరిపై కాంగ్రెస్ నేత శశిధరూర్ పసందైన వ్యాఖ్యానం చేశారు. ఎప్పుడూ కఠినమైన ఆంగ్ల పదాలతో ట్వీట్ చేసే శశిధరూర్ ఈ సారి చేసిన ట్వీట్ నెటిజన్లకు ఎంతగానో నచ్చింది. 


శశిధరూర్ తన పోస్టులో భేల్ పూరిని  ‘Exotic Crispy Puffed Wild Rice’ (కరలాడే రుచికరమైన చిరుతిండి) అని పేర్కొన్నారు. భేల్ పూరిని విభిన్నమైన ఆహార పదార్ధాలను కలిపి తయారు చేస్తారు. కేరళ బీచ్‌లలో... మిఠీ చట్నీ, మలబార్‌కు చెందిన ఆర్గానిక్ రా షుగర్‌తో భేల్‌పూరిని అలంకరిస్తారు. అలాగే గుజరాత్ నుంచి తెచ్చిన చిన్న ఉల్లిపాయలు, విదర్భకు చెందిన ఆలూను మిక్స్ చేస్తారు. చివరగా హైదరాబాద్ శనగలు, మార్వాడీ పాపడీలతో అలంకరించి మనకు అందిస్తారని రాశారు. శశిధరూర్ పోస్టు చూసిన నెటిజన్లు.... గోల్ గప్పే(పానీపూరీ), పోహాల గురించి కూడా వర్ణించాలని కోరారు. 


Updated Date - 2021-07-25T17:36:07+05:30 IST