
ఐసిఎఫ్(చెన్నై): అన్నాడీఎంకే అసమ్మతి వర్గ నాయకురాలు శశికళ గురువారం తంజావూరులో పర్యటించనున్నారు. అక్రమార్జన కేసులో శిక్ష అనుభవించి విడుదలైన శశికళ రాజకీయాల్లో పాల్గొంటానని ప్రకటించి, అన్నాడీఎంకే శ్రేణులతో సమావేశమవుతున్నారు. ఇందుకోసం అన్ని జిల్లాల్లో పర్యటిస్తున్న శశికళ గత 4వ తేది తిరునల్వేలి, తూత్తుకుడి, తెన్కాశి వంటి దక్షిణ జిల్లాల్లో రెండు రోజులు పర్యటించి అక్కడున్న ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించారు. గురువారం చెన్నై నుంచి రోడ్డు మార్గంగా తంజావూరు బయల్దేరనున్నారు. మార్గమధ్యంలో ఆమె మధురాంతకంలో ఉన్న ఏరికాత్త రామర్ ఆలయం, మేల్మరువత్తూర్ ఆదిపరాశక్తి ఆలయం, మేల్మలయనూరు అంకాళ పరమేశ్వరి ఆలయం, మైలం మురుగ పెరుమాళ్ ఆలయం, తిరువకరై వక్రకాళి అమ్మన్ ఆలయాలను దర్శించనున్నారు. అనంతరం కార్యకర్తలు, పార్టీ శ్రేణులను ఆమె కలుసుకోనున్నారు.