రాజన్నకు శఠగోపం పెట్టిన కేసీఆర్‌

ABN , First Publish Date - 2021-06-23T06:14:22+05:30 IST

రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాక్షాత్తూ వేములవాడ రాజరాజేశ్వరస్వామివారికే శఠగోపం పెట్టారని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు.

రాజన్నకు శఠగోపం పెట్టిన కేసీఆర్‌
పొన్నం ప్రభాకర్‌కు ప్రసాదం అందజేస్తున్న ఆలయ సిబ్బంది

- టీపీసీసీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ పొన్నం ప్రభాకర్‌

వేములవాడ, జూన్‌ 21 : రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సాక్షాత్తూ వేములవాడ  రాజరాజేశ్వరస్వామివారికే శఠగోపం పెట్టారని తెలంగాణ ప్రదేశ్‌ కాంగ్రెస్‌ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌, మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్‌ అన్నారు. మంగళవారం  వేములవాడ  రాజరాజేశ్వరస్వామివారిని దర్శించుకున్నారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సీఎం హోదాలో కేసీఆర్‌ వేములవాడ ఆలయాన్ని సందర్శించి ఆరేళ్ల కాలం పూర్తయినప్పటికీ  ఒక్క రూపాయి విలువైన అభివృద్ధి పని కూడా చేయలేదన్నారు. ప్రతీ సంవత్సరం వంద కోట్ల చొప్పున అభివృద్ధి పనులు చేస్తానని మాట తప్పి రాజన్నకే శఠగోపం పెట్టారని విమర్శించారు.   రంగు రంగుల డిజైన్లతో డిజిటల్‌ రూపంలో మాత్రమే అభివృద్ధి చూపిస్తున్నారని, వాస్తవానికి వేములవాడలో అభివృద్ధి జాడ లేదని అన్నారు. ఇండోర్‌ స్టేడియం,  డబుల్‌ బెడ్‌ రూం ఇళంల వంటి పనులు ప్రగతికి నోచుకోవడం లేదన్నారు. అభివృద్ధి పనులను పర్యవేక్షించాల్సిన స్థానిక ఎమ్మెల్యే చెన్నమనేని రమేశ్‌  పదిహేను నెలలుగా జర్మనీలో ఉంటున్నారని, ప్రభుత్వం కూడా వేములవాడ నియోజకవర్గాన్ని పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పటికైనా సీఎం కేసీఆర్‌ మనసు మార్చి అభివృద్ధి పనులు చేపట్టేలా చూడాలని వేములవాడ రాజరాజేశ్వరస్వామివారిని వేడుకున్నానని  తెలిపారు. కాం గ్రెస్‌ జిల్లా  అధ్యక్షుడు నాగుల సత్యనారాయణ, పీసీసీ కార్యదర్శి ఆది శ్రీనివాస్‌ ఉన్నారు.  

Updated Date - 2021-06-23T06:14:22+05:30 IST