woman bus driver: అంత అందగత్తె.. ఇంత గొప్ప బస్ డ్రైవర్.. మొత్తానికి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించిందిగా..

ABN , First Publish Date - 2022-07-24T23:16:58+05:30 IST

ఈ అమ్మాయి పేరు పూజా దేవి. అనడంతో పాటూ అనుకున్నది సాధించే పట్టుదల ఆవిడ సొంతం. అందుకే చిన్నతనం నుండి డ్రైవర్ (driver) కావాలనే తన కోరికను ఎట్టకేలకు..

woman bus driver:  అంత అందగత్తె.. ఇంత గొప్ప బస్ డ్రైవర్.. మొత్తానికి రాష్ట్రంలోనే రికార్డు సృష్టించిందిగా..

ఈ అమ్మాయి పేరు పూజా దేవి. అనడంతో పాటూ అనుకున్నది సాధించే పట్టుదల ఆవిడ సొంతం. అందుకే చిన్నతనం నుండి డ్రైవర్ (driver) కావాలనే తన కోరికను ఎట్టకేలకు నెరవేర్చుకొంది. ఇవాళ సోషల్ మీడియా (Social media) లో ఈవిడ ఒక హీరోయిన్ (Heroine). అందంతో పాటూ అద్భుతమైన డ్రైవింగ్ స్కిల్ ఈవిడ సొంతం. ఈమె బస్సు ఎక్కేందుకు జనం తహతహలాడతారు అక్కడ. అసలు సంగతికొస్తే.. పూజాదేవి అభీష్టాన్ని వ్యతిరేకించిన ఆమె కుటుంబం చివరకు ఆమె పట్టుదల ముందు తలొగ్గక తప్పలేదు. జమ్మూ కాశ్మీర్ రాష్ట్రంలో ఓ మహిళ తన కుటుంబాన్ని పోషించేందుకు బస్సు డ్రైవర్ అవతారం ఎత్తారు. భర్త సంపాదనకు ఆమె తోడుగా నిలిచింది. జమ్మూ కాశ్మీర్ (Jammu and Kashmir) రాష్ట్రంలో తొలి మహిళా బస్సు డ్రైవర్‌గా ఆమె రికార్డు (record) సృష్టించారు.


జమ్మూ రాష్ట్రంలోని కతువా జిల్లా నివాసి అయిన పూజా దేవి.. తన స్వస్థలం నుంచి జమ్మూ వరకు బస్సును నడిపారు. దేవి ప్రొఫెషనల్ (Professional) డ్రైవింగ్ ట్రైనర్. కుటుంబం, బంధువుల నుండి వ్యతిరేకత వ్యక్తమైనప్పటికీ వృత్తిపరంగా డ్రైవర్ కావాలనే అభిరుచిని కొనసాగించింది. డ్రైవర్‌గా పనిచేయడానికి తనకు తన కుటుంబం నుంచి తొలుత ఎవరూ మద్దతు ఇవ్వలేదన్నారు. కానీ, తనకు వేరే ఉద్యోగం ( job) ఎంచుకొనేంత చదువు లేదని... దీంతో డ్రైవింగ్ ద్వారానే తాను తన కుటుంబానికి చేదోడువాదోడుగా నిలవాలని భావించినట్టు చెప్పారు. తొలుత డ్రైవింగ్ స్కూల్ వాహనంలో ఇతరులకు డ్రైవింగ్ నేర్పించేది. భారీ వాహనాలను నడిపే ప్రొఫెషనల్  డ్రైవర్‪గా ఎదగాలనే కలను సాకారం చేసుకోవడానికి మేనమామ సహయం తీసుకుంది. తర్వాత కుటుంబ అవసరాల రీత్యా పూజ డ్రైవర్‌గా పనిచేసేందుకు కుటుంబసభ్యులు కూడా చివరికి అంగీకరించారు.

పచ్చ చొక్కా అంకుల్ అంటూ.. ఏడుస్తూ టీచర్ దగ్గరకు వెళ్లి జరిగిన దారుణాన్ని చెప్పిన 8 ఏళ్ల బాలిక.. చివరకు..


పూజ భర్త కూలీ పనులు చేస్తుంటాడు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. భర్తకు చేదోడువాదోడుగా ఉంటుందని కుటుంబసభ్యులు కూడా ఆమెను డ్రైవర్‌గా పనిచేసేందుకు అంగీకరించారు. డ్రైవింగ్ స్కూల్లో పనిచేసే సమయంలో ప్రతి నెలా ఆమె రూ.10 వేలు సంపాదించేది. ఆ తర్వాత భారీ వాహనాలు నడిపేందుకు వీలుగా లైసెన్స్ పొందింది. డ్రైవింగ్ యూనియన్ నేతలను కలిసి తన డ్రైవింగ్ నైపుణ్యం గురించి వివరించింది. చివరికి ఆమెను బస్సు నడిపేందుకు అంగీకరించారు. కతువా నుండి జమ్మూ వరకు బస్సు నడుపుతూ ఆమె తన సత్తాను నిరూపించింది. మహిళలు విమానాలను నడుపుతున్నారు. ఈ సమయంలో బస్సు నడపడం అసాధ్యం కాదన్నారు. ప్రయాణికులున్న బస్సును నడపాలనే తన ఆకాంక్షను చివరకు నేరవేర్చుకున్నట్టు సంతోషంగా చెబుతోంది. తమ కలలను సాకారం చేసుకోవాలనే మహిళలకు తన జీవితం స్ఫూర్తిగా నిలుస్తోందని ఆమె పేర్కొన్నారు.

Arpita Mukherjee Background: ఎవరీ అర్పితా ముఖర్జీ.. ఆమె ఇంట్లోకి రూ.20 కోట్ల నోట్ల కుప్పలు ఎలా వచ్చాయ్..?



Updated Date - 2022-07-24T23:16:58+05:30 IST