Advertisement

"క్షమించమ్మా... నీ కొడుకు ప్రాణం పోతోంది"

Dec 16 2020 @ 15:49PM

2015

"క్షమించమ్మా... కడుపులోనే నీ బిడ్డ ప్రాణం పోయింది"... తల్లి నసీమాతో డాక్టర్ అన్న మాటలివి.


2020

"క్షమించమ్మా... నీ కొడుకు ప్రాణం పోతోంది"... వేదనలో ఉన్న నసీమాతో మరో డాక్టర్ చెప్పిన మాటలు


తనకంటూ ఒక స్వంత కుటుంబం ఉండాలని నసీమా ఎప్పుడు కలలు కంటుండేది. ఆమె వివాహం జరిగాక, ఎట్టకేలకు తన కల నెరవేరింది. పెళ్ళయిన 6 సంవత్సరాల తర్వాత... నువ్వు తల్లి కాబోతున్నావంటూ నసీమాపై అభినందనల వెల్లువ కురిసింది.


తొలి కాన్పు కావడంతో నసీమా, ఆమె భర్త పట్టలేనంత ఆనందంగా ఉన్నారు. పుట్టబోయే చిన్నారి కోసం ఎన్నెన్నో చెయ్యాలన్న తపనతో వారు చాలా చాలా ఏర్పాట్లు చేసుకున్నారు. కానీ, ఆ తర్వాత జరిగిన పరిణామాలు వారిని కల్లోలంలోకి నెట్టేశాయి.


నసీమాకు నెలలు నిండి ప్రసవమయ్యే సమయంలో కడుపులోనే బిడ్డను కోల్పోయింది.

 

తన బిడ్డ లోకం చూడకముందే కన్నుమూయడంతో తల్లడిల్లిపోయినప్పటికీ, నసీమా మానసికంగా ఎంతో దృఢంగా ఉంది. అక్కడితో ఆగిపోకూడదని ఆమెకు తెలుసు. కొద్ది నెలల కిందట తనకు కొడుకు పుట్టినప్పుడు ఏదో మహిమ జరిగినట్టు ఆనందించింది.


చిన్నారి మహమ్మద్ ఆ ఇంటికి వెలుగయ్యాడు. అమ్మానాన్నలకు తనతో సమయం గడపడమంటే ఎంతో ఇష్టం. మహమ్మద్ తన ఆటపాటలతో అందరినీ ఆకట్టుకునేవాడు. కానీ, బాబుకు 40 రోజులు నిండిన నాటి నుంచి ఆ తల్లిదండ్రులు, చిన్నారి పాలిట పరిస్థితులు తారుమారయ్యాయి.


"అల్లా ఎట్టకేలకు నా ప్రార్థనలు ఆలకించి ఈ పసివాడిని ప్రసాదించాడు. నేను తల్లినయ్యేందుకు మరో అవకాశం వచ్చిందని వాడిని చూసిన క్షణానే నాకు అర్థమైంది. ఏదే ఏమైనప్పటికీ వాడిని కంటికిరెప్పలా కాపాడుకుంటానని నేను ఒట్టుపెట్టుకున్నాను. కానీ, ఇప్పుడు వాడి బాధ చూస్తూ నేను నిస్సహాయురాలినయ్యాను" అని వేదనగా చెప్పింద నసీమా.


ఎంతో ఆరోగ్యంగా ఉండే మహమ్మద్‌కు జ్వరం వచ్చినప్పుడు, ఎక్కడో సమస్య ఉందని నసీమా, ఆమె భర్త గుర్తించారు. ఆ పిల్లవాడి కళ్లు పసుపురంగులోకి మారడం గమనించారు. చర్మం కూడా వేగంగా పాలిపోయిన పసుపుపచ్చ రంగులోకి మారిపోయింది.


వెంటనే మహమ్మద్‌ను ఆసుపత్రికి తీసుకెళ్ళారు. ఎన్నో ఆసుపత్రులు తిరిగిన తర్వాత ఒక చోట అడ్మిట్ చేసుకున్నారు. ఆ పిల్లవాడు న్యుమోనియా, జాండీస్‌తో పాటు గుండెలో ఇన్ఫెక్షన్‌తో బాధపడుతున్నాడని, ఇతర ఆరోగ్య సమస్యలు కూడా ఉన్నాయని తెలిసి ఆ తల్లిదండ్రుల గుండె చెదిరిపోయింది.


ఏడు నెలల తమ చిన్నారి కఠినమైన చికిత్సను ఎదుర్కోవాల్సి రావడం అమ్మానాన్నలకు ఎంతో బాధాకరంగా అనిపించినా అది మాత్రమే ఆ పిల్లవాడిని కాపాడే ఒకేఒక మార్గం. ఈ చికిత్సలు తమ పసివాడికి ఎంతో నోప్పి కలిగించేవి అయినప్పటికీ... అవి తమ చిన్నారిని రక్షిస్తాయన్నది నసీమా విశ్వాసం.


కానీ, రోజులు గడుస్తున్న కొద్ది తన కొడుకు ఆరోగ్యం మరింత క్షీణిస్తున్నట్టు నసీమా గమనించింది. ఉన్న సమస్యలు చాలక, మహమ్మద్ పొట్ట ఉబ్బిపోయింది. తన శరీరం నిండా నల్లటి మచ్చలు కనిపిస్తున్నాయి, చిగుళ్ళ నుంచి రక్తం వస్తోంది.


ఆ పైన చిన్నారి మహమ్మద్‌కు మరిన్ని పరీక్షలు, ఇంకొన్ని చెకప్స్ జరిగాయి.


తన జీవితంలో అత్యంత దారుణమైన పరిస్థితి ఎదురవుతోందేమోనని నసీమాకు భయం వేసింది. కాలేయానికి సంబంధించిన అత్యంత ప్రాణాంతకమైన వ్యాధి Biliary Atresiaకు మహమ్మద్ గురైనట్టు వైద్యులు చెప్పినప్పుడు ఆమె భయం నిజమైంది.


మహమ్మద్‌ను కాపాడాలంటే ఆ చిన్నారికి అత్యవసరంగా కాలేయ మార్పిడి చికిత్స జరగాలని వైద్యులు అన్నారు. అదృష్టవశాత్తూ... తన కుమారుడికి అవయవ మార్పిడి కోసం నసీమా కాలేయం సరిపోయింది.


ఈ మాట విని ఆ దంపతులకు ఊరట కలిగినప్పటికీ, వారి హృదయ వేదన అలాగే ఉంది. ఎందుకంటే, ఈ కాలేయ మార్పిడికి అయ్యే ఖర్చు ఎలా భరించాలన్న ప్రశ్న వారి ముందుకొచ్చింది.


నసీమా ఒక సాధారణ గృహిణి. ఆమె భర్త ఒక టాక్సీ డ్రైవర్. ఎన్నో గంటల శారీరక శ్రమ తర్వాతే అవసరమైన ఆహారదినుసులతో ఆమె భర్త ఇంటికి వస్తాడు.


మహమ్మద్ జీవితాన్ని కాపాడేందుకయ్యే సర్జరీకి రూ.18,00,000 (18 లక్షలు) ఖర్చవుతుంది.ఈ మాట విని ఆ కొత్త దంపతులు మూగబోయారు. మహమ్మద్ కోసం ఇప్పటివరకూ అయిన చికిత్సకు వారు లక్షలాది రూపాయలు ఖర్చు పెట్టారు. ఇప్పుడు వారి చేతిలో చిల్లిగవ్వ లేదు.


మహమ్మద్‌కు వైద్యం కోసం తమ దగ్గరున్న అతని తండ్రి విలువైన ఆభరణాలన్నీ అమ్మాల్సి వచ్చింది. ఎందరి నుంచో అప్పు తీసుకున్నాడు. దురదృష్టవశాత్తు ఇప్పుడు అవేమీ సరిపోని పరిస్థితి.


నసీమా, ఆమె భర్త, వారి పసివాడు అనుభవించిన వేదన చూస్తే, వారికి ఇంతటి పరిస్థితి రావల్సింది కాదు. తమ చిన్నారి కుమారుడిని రక్షించుకోవడానికి ఆ నిరుపేద తల్లిదండ్రులు అంతులేకుండా ప్రయత్నిస్తూనే ఉన్నారు కానీ, ఇప్పుడు అన్ని దారులూ మూసుకున్నాయి. మహమ్మద్‌కు అత్యవసరంగా కాలేయ మార్పిడి చెయ్యకుంటే ఆ పసివాడు వారికి శాశ్వతంగా దూరమయ్యే ప్రమాదం పొంచి ఉంది. దయచేసి నసీమాకు చేయూతనివ్వండి, సాధారణ గృహిణి అయిన ఆ ప్రేమమూర్తిని మరోసారి దురదృష్టం వెక్కిరించే పరిస్థితి రానివ్వకండి.


ఈ కేసుకు సంబంధించిన అన్ని అంశాలనూ ఒక వైద్య బృందం సంబంధిత ఆసుపత్రికి వెళ్ళి పరిశీలించింది. మహమ్మద్‌కు చేసే చికిత్సకు సంబంధించిన ఖర్చులు, వివరాల కోసం క్యాంపెయిన్ ఆర్గనైజర్ లేదా సదరు వైద్య బృందాన్ని సంప్రదించవచ్చు.


చారిటీ నెంబరు: 81687318

గమనిక: ఈ ఫండ్ రైజర్‌ కోసం అందించే విరాళాలకు 80G, 501(c) తదితరాల కింద పన్ను మినహాయింపుల అర్హత లేదు.

Follow Us on:
Advertisement
అంతర్జాలంలో ప్రకటనల కొరకు సంప్రదించండి
For internet advertisement and sales please contact
[email protected]andhrajyothy.com
Copyright © and Trade Mark Notice owned by or licensed to Aamoda Publications PVT Ltd.
Designed & Developed by AndhraJyothy.