ఆ పిల్లల కోసమే ఆమె

ABN , First Publish Date - 2022-05-18T06:51:13+05:30 IST

‘‘ఆడపిల్లల జీవితాల మీద బాల్య వివాహాలు ఎంతటి ప్రభావం చూపిస్తాయనేది మా అమ్మను చూశాక అర్థమైంది.

ఆ పిల్లల కోసమే ఆమె

పధ్నాలుగేళ్ల వయసులో పెళ్లి చేస్తామంటే... వద్దని పెద్ద యుద్ధమే చేశారు ఉషా చౌదరి. అందర్నీ ఎదిరించి... కట్టుబాట్లను కాదని... చదువుకున్నారు.  నేడు బాల్య వివాహ వ్యవస్థను రూపుమాపేందుకు ఆమె తన పెళ్లిని సైతం త్యాగం చేసి పోరాడుతున్నారు... 


ట్రెండీగా... సౌకర్యవంతంగా..!


దుస్తులు సౌకర్యవంతంగా ఉండాలి... అదే సమయంలో ఆకట్టుకునేలా ఉండాలి... ట్రెండీగా కనిపించాలి... అంటే టాప్స్‌ మంచి ఆప్షన్స్‌గా చెప్పుకోవచ్చు. అంతేకాకుండా శరీరాకృతి ఏదైనా టాప్స్‌ బాగా నప్పుతాయి. సందర్భం ఏదైనా ఇవి మిమ్మల్ని నలుగురిలో ప్రత్యేకంగా కనిపించేలా చేస్తాయి. ఇక వీటిలో ఏ-లైన్‌ ట్యునిక్‌, మాక్సీ, పెప్లమ్‌, టియర్డ్‌, ప్రింటెడ్‌, ఫ్లేర్డ్‌ స్లీవ్స్‌ వంటి టాప్స్‌ను ఎంచుకోవచ్చు. 


‘‘ఆడపిల్లల జీవితాల మీద బాల్య వివాహాలు ఎంతటి ప్రభావం చూపిస్తాయనేది మా అమ్మను చూశాక అర్థమైంది. అమ్మకు చిన్నప్పుడే పెళ్లయింది. ఆమెకు పదిహేనేళ్లు కూడా నిండకుండానే నేను పుట్టాను. నలుగురు సంతానంలో నేనే పెద్దదాన్ని. అంత చిన్న వయసులో పిల్లల్ని పెంచడానికి అమ్మ పడిన అవస్థలు నాకు ఇంకా గుర్తున్నాయి. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌ జిల్లా మాది. సాధారణ మధ్యతరగతి కుటుంబం. సంప్రదాయాలు, కట్టుబాట్లు... అమ్మాయిలకు అక్కడ స్వేచ్ఛలేదు. అడుగడుగునా ప్రతిబంధకాలే. అలాంటి సమాజంపై నా పోరాటం పధ్నాలుగేళ్లప్పుడే మొదలైంది. నేను పదోతరగతిలోకి వచ్చేసరికి పరిస్థితి పతాక స్థాయికి చేరింది. ఒకరోజు అమ్మ నా దగ్గరకు వచ్చి... ‘రెండు నెలల్లో నీకు పెళ్లి’ అని చెప్పింది. ఆ షాక్‌ నుంచి తేరుకోవడానికి కాస్త సమయం పట్టింది. ఎలాగైనా సరే... చదువయ్యే దాకా పెళ్లి చేసుకోకూడదనే నిర్ణయానికి వచ్చాను. మా అమ్మనే కాదు... తనలా చిన్నతనంలోనే పెళ్లయిన ఎందరినో చూశాను. వాళ్ల బాధలు, ఇబ్బందులు చూశాను. అందుకే చదువు తరువాతే పెళ్లని పట్టుబట్టాను. ఇంట్లోవాళ్లే కాదు... చుట్టాలు, చుట్టుపక్కలవారు కూడా నా మీద ఒత్తిడి చేశారు. అందర్నీ 


ఎదిరించాను. జీవన్మరణ సమస్య... 

ఎంత చెప్పినా ఇంట్లోవాళ్లు వినలేదు. ‘నీవల్ల మన కుటుంబం పరువు పోయింద’ని నానామాటలు అన్నారు. కానీ నాకు అది జీవన్మరణ సమస్య. ఆ వయసులో పెళ్లి చేసుకుని రోజూ చచ్చేకంటే ఒక్కసారే చావడం మేలనిపించింది. ఉద్రేకాలు... ఉద్వేగాలు... మనసులో ఎన్నో సంఘర్షణలు. స్కూల్లో ఆటలు బాగా ఆడేదాన్ని. హ్యాండ్‌బాల్‌లో రాష్ట్ర జట్టుకు ప్రాతినిథ్యం వహించాను కూడా. నాలోని ప్రతిభ ఎవరూ గుర్తించలేదు సరికదా... కనీసం నన్ను ఒక మనిషిగా కూడా చూడలేదు. ఈ పరిస్థితి మారాలంటే చదువు తప్ప వేరే మార్గం లేదనుకున్నాను. పట్టుబట్టి పదకొండో తరగతిలో చేరాను. కానీ ఫీజు కట్టలేక మధ్యలోనే ఆపేశాను.  


పని చేస్తూ... 

చదువు పూర్తి చేయాలన్న సంకల్పంతో ఒక స్కూల్లో టీచర్‌గా చేరాను. ఇంటి దగ్గర ట్యూషన్లు చెప్పాను. కొన్ని రోజులు కొరియర్‌ సంస్థలో పనిచేశాను. ఆ డబ్బుతో ఫీజులు కట్టి... ప్రైవేట్‌గా డిగ్రీ, ఆ తరువాత ఎంఏ చదివాను. చదువు పూర్తయిన క్షణమే నిర్ణయించుకున్నా... ఇకపై బాల్య వివాహాలకు వ్యతిరేకంగా పోరాడాలని. నా జీవితం దానికే అంకితం చేయాలని. అందుకే పెళ్లి కూడా వద్దనుకున్నాను. బతికినంత కాలం నాలాంటి ఆడపిల్లల కోసం నిలబడాలని ధ్యేయంగా పెట్టుకున్నాను.  


‘వికల్ప్‌’తో చైతన్యం... 

ఈ దురాచారం ఒక్క రోజులో పోయేది కాదు. అవగాహన కల్పిస్తూ, పరిస్థితులను వివరిస్తూ ముందడుగు వేయాలి. విద్యావంతులను చేయాలి. అందుకే మా ప్రాంతంలోని వాల్మీకీ సమాజ్‌ చిన్నారుల కోసం స్కూల్‌ ఒకటి ప్రారంభించాను. బాల్య వివాహాలు, బడి మధ్యలో మానేసిన పిల్లలు వారిలోనే అధికం. అదే సమయంలో ‘ఆస్థా’ అనే స్వచ్ఛంద సంస్థలో కూడా చేరాను. గిరిజన మహిళలు, వితంతువుల అభ్యున్నతి కోసం పని చేసే సంస్థ అది. అందులో పని చేయడం వల్ల అణగారిన వర్గాల స్థితిగతులు తెలుసుకోగలిగాను. ఆ అనుభవంతోనే 2003లో ‘వికల్ప్‌ సంస్థాన్‌’ పేరుతో స్వచ్ఛంద సంస్థ ఒకటి నెలకొల్పాను. ఆడపిల్లలకు మెరుగైన విద్యావకాశాలు కల్పించి, బాల్యవివాహాలపై చైతన్యం తేవడమే ఈ సంస్థ లక్ష్యం. 


అక్షర జ్ఞానంతో చైతన్యం

ఎప్పుడైతే సంస్థ ప్రారంభించానో... ఇక అక్కడి నుంచి నా కార్యకలాపాలు విస్తరిస్తూ వెళ్లా. చాలా సమస్యలకు ప్రధాన కారణం నిరక్షరాస్యత. అందుకే అక్షర జ్ఞానంతో వారిలో చైతన్యం తేవాలని ప్రయత్నిస్తున్నాం. నెలకు రెండుసార్లు ప్రతి గ్రామంలోని పాఠశాలలకు వెళ్లి, అక్కడి విద్యార్థులతో మాట్లాడతాం. బాల్య వివాహం చేసుకోబోమని, చదువు మధ్యలో ఆపేయమని వారితో ప్రతిజ్ఞ చేయిస్తాం. 


దాడి చేసినా... 

ఆరంభంలో ఎన్నో సవాళ్లు ఎదుర్కొన్నాం. ఊళ్లల్లోకి వెళ్లి అవగాహన కార్యక్రమాలు నిర్వహించినప్పుడు చాలాచోట్ల మాకు వ్యతిరేకత ఎదురైంది. ముఖ్యంగా బాలికల కుటుంబాల నుంచి. వీధి నాటకాలు ప్రదర్శిస్తున్నప్పుడు మాపై స్థానికులు దాడి కూడా చేశారు. భయభ్రాంతులకు గురిచేశారు. కానీ నేను దేనికీ భయపడలేదు. నా లక్ష్యం ముందు అవన్నీ పెద్ద సమస్యలుగా అనిపించలేదు. వాటన్నిటినీ దాటుకొని వెళ్లాం కనుకనే నేడు నేను, నా బృందాలు వేల సంఖ్యలో బాల్య వివాహాలను ఆపగలిగాం. ఆడపిల్లల్లో స్ఫూర్తి నింపేందుకు తరచూ మహిళా కలెక్టర్లు, పోలీస్‌ అధికారులు, ఉపాధ్యాయులు, వైద్యులతో పరిచయ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నాం. కెరీర్‌ కౌన్సెలింగ్‌ కూడా ఇచ్చి... వారి బంగరు భవిష్యత్తు నిర్మాణానికి మా వంతు సాయం అందిస్తున్నాం. వారిలో ఎంతోమంది ప్రయోజకులయ్యారు. ఉన్నత చదువులు చదువుతున్నారు. ఈ మార్పే నేను కోరుకున్నది.’’


రాజస్థాన్‌లోని 12 జిల్లాల్లో వందకు పైగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశా. ఈ బృందాల్లో 8 నుంచి 20 సంవత్సరాల మధ్య వయసు విద్యార్థులు సభ్యులుగా ఉంటారు. వీరంతా బాల్య వివాహాలు నియంత్రించడానికి కృషి చేస్తారు. ఆడపిల్లల తల్లితండ్రులకు బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలు వివరిస్తారు. సంబంధిత చట్టాల గురించి అవగాహన కల్పిస్తారు.

Updated Date - 2022-05-18T06:51:13+05:30 IST